క్రిస్‌గేల్‌కు Ind Vs Pak మ్యాచ్‌ ఫీవర్‌! | Chris Gayle Gears Up For Ind Vs Pak World Cup 2019 Clash | Sakshi
Sakshi News home page

క్రిస్‌గేల్‌కు Ind Vs Pak మ్యాచ్‌ ఫీవర్‌!

Jun 16 2019 11:01 AM | Updated on Jun 16 2019 3:29 PM

Chris Gayle Gears Up For Ind Vs Pak World Cup 2019 Clash - Sakshi

భారత్‌-పాక్‌ డ్రెస్‌తో గేల్‌

ఇరు జట్లు తనకిష్టమే అన్నట్లుగా వెస్టిండీస్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ ప్రత్యేకమైన డ్రెస్‌తో

లండన్‌ : భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ఇరుదేశాల అభిమానులే కాదు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, రాజకీయ కారణాలు ఈ జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు లేకుండా చేశాయి. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా ప్రత్యేకంగా నిలుస్తోంది. నేడు విశ్వవేదికపై దాయాదులు పోరుకు సిద్దం కాగా.. అభిమానులు, ఆయాదేశాల క్రికెటర్లు వారి జట్లకు మద్దతు పలుకుతున్నారు. వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌గేల్‌ మాత్రం ఇరు జట్లు తనకిష్టమే అన్నట్లుగా ప్రత్యేకమైన డ్రెస్‌తో సిద్ధమయ్యాడు. ఒక వైపు భారత పతాకం రంగులు, మరో వైపు  పాక్‌ జెండా రంగులతో ఉన్న డ్రెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తన బర్త్‌డే(సెప్టెంబర్‌ 20)కు కూడా ఇదే డ్రెస్‌ ధరిస్తానంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఐపీఎల్‌, ఐసీఎల్‌ పుణ్యమా గేల్‌కు ఇరు దేశాల్లో అభిమానగణం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement