వైరల్‌ : డోర్‌బెల్‌ దగ్గర అనుకోని అతిథి..! | Snake Bites A Man At Door Bell Captured The Terrifying Moment | Sakshi
Sakshi News home page

వైరల్‌ : డోర్‌బెల్‌ దగ్గర అనుకోని అతిథి..!

May 8 2019 6:54 PM | Updated on May 8 2019 7:14 PM

Snake Bites A Man At Door Bell Captured The Terrifying Moment - Sakshi

ఓక్లహోమా : మిత్రున్ని కలిసి వెళ్దామని వచ్చిన ఓ వ్యక్తికి అనుకోని అతిథి ఎదురయ్యాడు. డోర్‌బెల్‌ దగ్గర నక్కి ప్రతాపం చూపాడు. ఊహించని ఆతిథ్యం లభించడంతో ఆ వచ్చిన వ్యక్తి భయంతో కంపించిపోయాడు. ప్రాణ భయంతో సాయం కోసం అర్థించాడు. జెరెల్‌ హేవుడ్‌ తన ఫ్రెండ్‌ రోడ్నీ కోప్‌ల్యాండ్‌ను చూడ్డానికి గత ఆదివారం ఓక్లహోమాలోని లాటన్‌కు వెళ్లాడు. కోప్‌ల్యాండ్‌ ఇంటి బయట ఉన్న డోర్‌బెల్‌ కొట్టగానే అతని మొహంపై పాము కాటు వేసింది. సరిగ్గా కుడికన్ను పైభాగంలో కోరలు దించింది.

నొప్పితో తల్లడిల్లిపోయిన హేవుడ్‌.. షాక్‌ నుంచి తేరుకుని.. సాయం కోసం కేకలు వేశాడు. కోప్‌ల్యాండ్‌ సాయంతో హేవుడ్‌ ఆస్పత్రికి చేరుకున్నాడు. ‘నా ఫ్రెండ్‌ని పాము కాటేయడం.. సీసీ కెమెరాలో చూసి షాకయ్యాను. హేవుడ్‌ని కరిచిన పాము విషపూరితమైంది కాదు. అతను కోలుకుంటున్నాడు’ అని కోప్‌ల్యాండ్‌ తెలిపారు. హేవుడ్‌ని పాము కాటేస్తున్న వీడియో వైరల్‌ అయింది. ఇక ఇంట్లోకి దూరేందుకు యత్నించిన 5.5 అంగుళాల పొడవున్న ఆ పాముని కొట్టి చంపారు.

Advertisement
 
Advertisement
Advertisement