నేనూ స్టెప్పేస్తా..! : ఆనంద్‌ మహింద్రా | Anand Mahindra Says He Will Start Doing Bollywood Dance Moves | Sakshi
Sakshi News home page

నేనూ స్టెప్పేస్తా..! : ఆనంద్‌ మహింద్రా

Aug 19 2019 3:45 PM | Updated on Aug 19 2019 6:34 PM

Anand Mahindra Says He Will Start Doing Bollywood Dance Moves - Sakshi

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా మరో ఆసక్తికరమైన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఓ అమెరికన్‌ హాస్యనటుడు రద్దీగా ఉన్న న్యూయార్క్‌ వీధుల్లో బాలీవుడ్‌ పాటలకు డాన్స్‌ చేస్తున్నవీడియోను పోస్టు చేసిన ఆయన.. ‘ఈ ఆదివారం గొప్పగా నవ్వుకోవచ్చు. భవిష్యత్‌లో నేను మాన్‌హట్టన్‌కు వచ్చినప్పుడు బాలీవుడ్‌ పాటలకు ఇలాంటి స్టెప్పేస్తే చాలు, ఒంటరిగా ఉన్న ఫీలింగ్‌ రాదు’ అంటూ కామెంట్‌ చేశారు.  ఆయన  చేసిన ఈ పోస్ట్‌ సరదాగా ఉండటంతో నెటిజన్లు నవ్వుకుంటూ తెగ ఫార్వర్డ్‌ చేస్తున్నారు. 

ఆనంద్‌కు  ట్విటర్‌లో ఫాలోవార్లు ఎక్కువ. ఆయన ప్రతినిత్యం ఆసక్తికర అంశాలు, సరదా సంఘటనల గురించి ట్వీట్‌ చేస్తుంటారు. ఓ అభిమాని తన పుట్టినరోజుకు కారు బహుమతిగా ఇవ్వాలంటూ చేసిన ట్వీట్‌కు ఆనంద్‌ ఇటీవల ఇచ్చిన సమాధానం తెగ ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌లో ఆనంద్‌ అరుదుగా వాడే ఓ ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఆనంద్‌ ’నీ కోరికను మన్నించలేను. అలా చేస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది’ అంటూ సరదాగా బదులిచ్చారు. కాగా, గతవారం వైరల్‌గా మారిన ఒక బుడ్డోడి వీడియోను ఆనంద్‌ ట్విటర్‌లో పోస్ట్‌  చేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement