కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో వైఎస్‌ జగన్‌ భేటి

YS Jagan Meets CEC Over Submit Memorandum Against Chandrababu Naidu Govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై వైఎస్‌ జగన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను కూడా ప్రస్తావించారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరా దృష్టికి ఆధారాలతో సహా తీసుకెళ్లారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్‌లు ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top