మెదక్‌ పరిధిలో కూటమికి సీట్లు కేటాయించొద్దు | Vijayashanthi about seats to mahakutami | Sakshi
Sakshi News home page

మెదక్‌ పరిధిలో కూటమికి సీట్లు కేటాయించొద్దు

Oct 20 2018 2:44 AM | Updated on Mar 18 2019 9:02 PM

Vijayashanthi about seats to mahakutami - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో మహాకూటమిలోని పార్టీలకు ఒక్క సీటు కేటాయించొద్దని కాంగ్రెస్‌ స్టార్‌ క్యాం పెయినర్‌ విజయశాంతి సూచించారు. ఒక వేళ కూటమి తరఫున అభ్యర్థులను నిలిపితే మాత్రం మెదక్‌ పార్లమెంట్‌ స్థానంపై ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు తప్ప కూటమి అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదని తెలిపారు. అం తేకాకుండా కాంగ్రెస్‌ కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి సైతం లేదని శుక్రవారం పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement