‘దేవుడి​కే టోపీ పెట్టే పార్టీ అది’ | TRS MP Kavitha Critisize Congress And BJP | Sakshi
Sakshi News home page

‘దేవుడి​కే టోపీ పెట్టే పార్టీ అది’

Mar 18 2019 3:43 PM | Updated on Mar 18 2019 3:55 PM

TRS MP Kavitha Critisize Congress And BJP - Sakshi

సాక్షి, జగిత్యాల : దేశంలో పేదరికం పెరగడానికి కారణం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలేనని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ పేదరిక నిర్మూలనకు చేసిందేమి లేదని విమర్శించారు. ఈ ఐదేళ్లలో బీజేపీ ఒక సారి నోట్లు మార్చింది, మరోసారి టాక్స్‌ మార్చింది, ఇక వందల సార్లు మాట మార్చిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే బీజేపీకి గుడి గుర్తుకు వస్తుందని.. ప్రజలకే కాదు దేవుడికి సైతం టోపీ పెట్టే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. జవాబుదారితనం లేని పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. నిజామాబాద్‌లో రేపు సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభకు జగిత్యాల నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement