Prasant Kishore Responds on Chandrababu Naidu Comments | ఓటమి తథ్యం కావడంతోనే... బాబు భయపడుతున్నారు - Sakshi
Sakshi News home page

ఓటమి తథ్యం కావడంతోనే.. బాబుపై ప్రశాంత్‌ కిషోర్‌ ఫైర్‌

Mar 19 2019 12:18 PM | Updated on Mar 19 2019 10:03 PM

Prashant Kishor Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తూ చెలరేగిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తొలిసారి స్పందించారు. ఓటమి కళ్లముందు మెదులుతుంటే చంద్రబాబులాంటి నేతలు అడ్డగోలుగా మాట్లాడటంలో ఆశ్చర్యమేమీ లేదని, బిహార్‌ను కించపరిచేరీతిలో దుర్భాషలు ఆడటం కన్నా..
ఏపీ ప్రజలు మీకు ఎందుకు ఓటెయ్యాలనే దానిపై ఫోకస్‌ చేయండి అంటూ చంద్రబాబుకు ఘాటుగా సూచించారు.

‘ ఓటమి తథ్యమని తేలడం ఎంతటి రాజకీయ నాయకుడినైనా దెబ్బతీస్తుంది. చంద్రబాబునాయుడు ఉపయోగిస్తున్న భాష నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. సర్‌జీ బిహార్‌ను కించపరిచేలా దుర్భాషలాడటం కన్నా.. ఏపీ ప్రజలు మీకు ఓటు ఎందుకు వెయ్యాలనే దానిపై ఫోకస్‌ చేయాలి’ అని ప్రశాంత్‌ కిషోర్‌ ట్విటర్‌లో హితవు పలికారు. ఒంగోలు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కేసీఆర్‌ క్రిమినల్‌ రాజకీయాలు చేస్తున్నారని, బిహార్‌ బందీపోటు ప్రశాంత్‌ కిషోర్‌ ఏపీలో లక్షలాది ఓట్లను తొలగించారని అడ్డగోలుగా చేసిన ఆరోపణలపై ఆయన ఈమేరకు స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement