బీజేపీ అంటే వణుకెందుకు?: కె.లక్ష్మణ్‌  | Laxman Comments On Congress and TRS | Sakshi
Sakshi News home page

బీజేపీ అంటే వణుకెందుకు?: కె.లక్ష్మణ్‌ 

Aug 17 2019 3:34 AM | Updated on Aug 17 2019 3:34 AM

Laxman Comments On Congress and TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవుట్‌డేటెడ్‌ నాయకులంతా తమపారీ్టలోకి వస్తుంటే టీఆర్‌ఎస్‌కు వణుకెందుకని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రశ్నిం చారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తోన్న ఆదరణ చూసి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ భయపడుతున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలసినా బీజేపీని ఏం చేయలేరన్నారు.

టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి చేరుతున్న నాయకుల విషయంలో కేసీఆర్, కేటీఆర్‌లు విమర్శలు చేస్తు న్నారని, వాళ్లంతా మీ వద్ద ఉంటే బంగారు కొండలు..మా దగ్గరకొస్తే అవుట్‌డేటెడ్‌ నాయకులా? అని ప్రశ్నించారు. అదే అవుట్‌డేటెట్‌ నాయకుల్లో ఒకరి ని పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా, మరొకరిని ఆర్టీసీ చైర్మన్, ఇంకొకరిని ప్రభుత్వ సలహాదారుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ వివేక్‌ ఇంటికి వెళ్లి గంటపాటు బతిమిలాడినా ఆయన బీజేపీలో చేరారన్నారు.

రాష్ట్రంలో ప్రజలు జ్వరాలతో దీనస్థితి లో ఉంటే సీఎం పట్టించుకోవడం లేదన్నారు.  త్వరలో నే మీ అవుట్‌డేటెడ్‌ ప్రభుత్వంపోయి మా అప్‌డేటెడ్‌ సర్కారు వస్తుందని చురకలంటించారు. మున్సిపల్‌ ఎన్నికల విషయంలో కోర్టు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.  

సమావేశంలో నేతలు మల్లారెడ్డి, సాంబమూర్తి, రాకేష్‌ రెడ్డి, రాంచందర్‌రావు, మాధవీలత పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశా రు. రాష్ట్ర ప్రభు త్వం దివాలా తీసిందనడానికి ఆరో గ్యశ్రీ సేవల నిలుపుదల ఒక ఉదాహరణ అని అన్నారు. ప్రభుత్వ సంపద రెండింతలైనప్పుడు బకా యిలు వెంటనే చెల్లించలేరా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement