అసామాన్య...సామాన్యుడు!

Bommagani Dharmabiksham Political Life Story - Sakshi

బొమ్మగాని ధర్మభిక్షం

15 ఫిబ్రవరి 1922 – 26 మార్చి 2011

వీరతెలంగాణ సాయుధ పోరాట యోధుడు

మూడుసార్లు ఎమ్మెల్యే.. రెండుసార్లు ఎంపీ

తొలి విద్యార్థి ఉద్యమ నాయకుడు

ప్రజా జీవితం కోసం ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయిన నేత

జర్నలిస్టుగా పనిచేసిన కమ్యూనిస్టు ఉద్దండుడు

నల్లగొండ :విద్యార్థి నాయకుడు.. హాకీ టీమ్‌ కెప్టెన్‌.. ఆర్యసమాజ్‌ సారథి.. ఆంధ్ర మహాసభ ఆర్గనైజర్‌.. కార్మిక సంఘాల నాయకుడు.. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. కమ్యూనిస్టు.. జర్నలిస్ట్‌.. ఎమ్మెల్యే.. ఎంపీ.. ప్రజా జీవితమే పరమావధిగా ఆజన్మ బ్రహ్మచారిగా గడిపిన ఆదర్శ నేత.. వెరసి ఇన్ని లక్షణాలు.. రూపాలు అచ్చుబోస్తే.. బొమ్మగాని భిక్షం అలియాస్‌ బొమ్మగాని ధర్మభిక్షం..!. ధర్మాన్ని కోరిన విద్యార్థి నాయకుడిగా నాటి హైదరాబాద్‌ కొత్వాల్‌ రాజ్‌బహద్దూర్‌ వెంకటరామారెడ్డి భిక్షంకు పెట్టిన పేరు ధర్మభిక్షం..‘‘భిక్షం మాంగా ధర్మ్‌.. కియాఇన్‌కా నామ్‌ ధర్మ్‌భిక్షు హై..’’!  అన్న నాటి నుంచి ఆయన ధర్మభిక్షంగానే ప్రాచుర్యం పొందారు....::: ఎన్‌.క్రాంతీపద్మ

ఇదీ నేపథ్యం
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో గీతకార్మికుల ఇంట ఫిబ్రవరి 15, 1922న ధర్మభిక్షం జన్మించారు. ఆయన కుటుంబం సూర్యాపేటలో స్థిరపడింది. విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్న చైతన్య శీలి. విద్యార్ధి సంఘం నాయకుడిగా పనిచేశారు. తాను సొంతంగా నడిపిన హాస్టల్‌లోని విద్యార్థులను ఉద్యమంలోకి వచ్చేలా ఆర్గనైజ్‌ చేశారు. కార్మిక నాయకుడిగా.. వివిధ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి ఉద్యమించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, మూసీ ప్రాజెక్టుల నిర్మాణాల సమయంలో ఆయన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పోరాడారు. ఆర్యసమాజ్‌లో పనిచేసిన సమయంలో జీవహింసకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ తర్వాత ఆంధ్రమహాసభతో మమేకమయ్యారు. ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనే తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండల్లో పాత్రికేయునిగా కూడా పనిచేశారు.

విద్యార్థి జీవితం
ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను ధిక్కరించి సహ విద్యార్థులతో కలిసిబహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతి గృహం ఏర్పాటు చేశారు. సూర్యాపేటలోనే మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. తెలుగుతో పాటు ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు.

సాయుధ పోరాట యోధుడు
నిజాంపై సాయుధ పోరాటం మొదలైన తర్వాత తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధ పోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్టయ్యి.. ఔరంగాబాద్, జాల్నా జైళ్లో ఉన్నారు. మొత్తంగా అయిదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు. జాల్నా జైళ్లో ఏకంగా పదివేల మంది ఖైదీలతో సమ్మె చేయించిన ఘనత కూడా ఆయనదే. గీత పనివారల సంఘం నేతృత్వంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరి వరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మభిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు. సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి కంటే సీనియర్‌ అయిన ధర్మభిక్షం, సాయుధ పోరాటంలో మాత్రం ఇద్దరూ కలిసి ఒకేసారి పాల్గొన్నారు. బీఎన్‌ అజ్ఞాత జీవితం గడపగా, ధర్మభిక్షం జైలు జీవితం ఎక్కువ కాలం గడిపారు.

రాజకీయ జీవితం
స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు 1957లో నకిరేకల్‌ నుంచి, 1962లో నల్లగొండ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. భారత ప్రభుత్వం నుంచి తామ్ర పత్ర పురస్కారం అందుకున్నారు. గ్రామీణ పేదల హక్కుల కోసం యువత, విద్యార్థులు, అసంఘటిత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు నడిపారు. స్వాతంత్య్ర సమరయోధునిగానూ ఆయనది అసమాన పాత్ర. నల్లగొండలో పలు కార్మిక సంఘాలను స్థాపించారు. 1991–1996 మధ్య పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ (గ్రామీణాభివృద్ధి శాఖ) సభ్యులుగా పనిచేశారు.

మరిన్ని వార్తలు

21-05-2019
May 21, 2019, 05:19 IST
సాక్షి, హైదరాబాద్‌: మరో 48 గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో విజేతలెవరో తేలనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 17...
21-05-2019
May 21, 2019, 05:02 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత పకడ్బందీగా...
21-05-2019
May 21, 2019, 04:56 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు మించి రాష్ట్రంలో బీజేపీకి లోక్‌సభ సీట్లు దక్కనున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...
21-05-2019
May 21, 2019, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడేసరికి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘంగా జరిగిన ఎన్నికలు కావడంతో...
21-05-2019
May 21, 2019, 04:38 IST
ప్రధాని మోదీ స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపుగా అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడించడంతో బీజేపీ...
21-05-2019
May 21, 2019, 04:20 IST
ముంబై: సోషల్‌ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్‌ షేర్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే దేశం యావత్తు ఉలిక్కిపడేలా ప్రకంపనలు రేగుతాయి....
21-05-2019
May 21, 2019, 04:12 IST
న్యూఢిల్లీ: సోమవారం ఉదయానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చూస్తే 67.11% పోలింగ్‌ నమోదైంది....
21-05-2019
May 21, 2019, 01:43 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఈసారి ఎదురుగాలి వీయనుందని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది. కాంగ్రెస్‌ కంచుకోటగా...
20-05-2019
May 20, 2019, 20:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ నార్త్‌ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓటమి తప్పదని...
20-05-2019
May 20, 2019, 20:24 IST
ఐటీ గ్రిడ్‌ నిందితుడు అశోక్‌, ఫోర్జరీ కేసు నిందితుడు, టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌, కోడికత్తి కేసు..
20-05-2019
May 20, 2019, 19:57 IST
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్‌–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్‌ ఏజెంట్, పరిశీలకులు, సహాయ...
20-05-2019
May 20, 2019, 19:24 IST
ఎగ్జిట్‌ వార్‌ : విపక్షాలపై బీజేపీ మండిపాటు
20-05-2019
May 20, 2019, 19:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ చావాల్సిందేనని స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా వెల్లడైన...
20-05-2019
May 20, 2019, 18:53 IST
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్‌లను లెక్కించేలా...
20-05-2019
May 20, 2019, 18:16 IST
దీదీతో అఖిలేష్‌ మంతనాలు
20-05-2019
May 20, 2019, 17:49 IST
ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగా ఫలితాలు..
20-05-2019
May 20, 2019, 17:32 IST
సాక్షి, అమరావతి: రీపోలింగ్‌ ముగియడంతో ఎన్నికల సంఘం కౌంటింగ్‌పై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో 34 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్‌...
20-05-2019
May 20, 2019, 17:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలకు తక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటిస్తే సా​ధారణంగానే వారు ఆ ఫలితాలను తప్పుపడతారని బీజేపీ జాతీయ...
20-05-2019
May 20, 2019, 16:23 IST
సాక్షి, న్యూఢిల్లీ:  నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై...
20-05-2019
May 20, 2019, 16:22 IST
సాక్షి, హైదరాబాద్‌ : జిల్లా పార్లమెంట్ ఎన్నికల వివరాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 17,86,515...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top