‘రాహుల్‌ ఇంకా మేల్కోలేదేమో..!’ | BJP Taunts Seems Rahul Gandhi Can Not Wake Up | Sakshi
Sakshi News home page

రాహుల్‌ ప్రెస్‌మీట్‌ వాయిదాపై బీజేపీ కామెంట్స్‌

Mar 22 2019 2:25 PM | Updated on Mar 22 2019 2:30 PM

BJP Taunts Seems Rahul Gandhi Can Not Wake Up - Sakshi

న్యూఢిల్లీ : రాహుల్‌ గాంధీకి పొద్దునే నిద్ర లేచే అలవాటు లేదు. అందుకే ప్రెస్‌ మీట్‌కు హాజరు కాలేకపోయాడు అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. విషయం ఏంటంటే.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. మీడియా సమావేశాలు పెట్టి మరీ బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10.15 గంటలకు రాహుల్‌ గాంధీ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నిన్న వెల్లడించింది. అయితే ఆ ప్రెస్‌మీట్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా పడింది. ఈ విషయాన్ని ఏఎన్ఐ మీడియా సంస్థ ట్వీట్ చేసింది.

దీనిపై స్పందించిన బీజేపీ.. రాహుల్‌ ఇంకా నిద్రలేవలేదేమో అంటూ ఎగతాళి చేసింది.  ‘రాహుల్‌ గాంధీ ఇంకా నిద్ర లేచినట్లు లేరు. పోనీలే పొద్దుపొద్దునే అబద్ధాలు ప్రచారం చేయడం మంచిది కాదు’ అంటూ బీజేపీ ట్వీట్‌ చేసింది. దీనికి బదులుగా కాంగ్రెస్‌ ‘ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఎప్పడైనా పర్లేదు.. దొంగ కాపాలదారుకు వీలైతే ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనమనండి.. సంతోషిస్తామం’టూ రీట్వీట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement