40 శాతం రోడ్డు ప్రమాదాలు నిశిరాత్రిలోనే


 అర్ధరాత్రి తర్వాత మొదలుకుని తెల్లవారుజాముదాకా ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉండరనేది సర్వసాధారణంగా మారడం ప్రమాదాలకు హేతువవుతోంది. ఈ ధీమాతోనే డ్రైవర్లు సిగనళ్లను పట్టించుకోకుండా అత్యంత వేగంగా దూసుకుపోవడం అదే మార్గంలో ప్రయాణించే ఇతర వాహనదారులకు శాపంగా పరిణమిస్తోంది. మరోవైపు సిగ్నల్ ఉన్నా పట్టించుకోకుండా ముందుకుపోతున్నవారిని ఒకవేళ ట్రాఫిక్ సిబ్బంది ఆపినప్పటికీ వారికి విధిస్తున్న జరిమానా మొత్తం తక్కువగా ఉండడం కూడా ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తోంది.

 

 సాక్షి, న్యూఢిల్లీ:మితిమీరిన వేగం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన రోడ్డు ప్రమాదాలకు హేతువవుతోంది. నగరంలో ఈ ఏడాదిమే 15 వరకు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 663 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే రోజుకు  సగటున ఐదుగురు రాజధానిలో జరుగుతున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడిపేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించినప్పటి నుంచి ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిం ది. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలను వాహనచోదకులు గాలికొదిలేయడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. 40 శాతం ప్రమాదాలు రాత్రివేళల్లోనే జరుగుతున్నాయి. ఆ సమయంలో రహదారులపై భారీ వాహనాలు ప్రయాణించడం, ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉండకపోవడం, ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడం, వాహనచోదకులకు ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లేకపోవడం, ఒకవేళ ఉన్నా పట్టించుకోకపోవడం తదితర కారణాలవల్ల రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కు వగా జరుగుతున్నాయి. ఈ ఏడాది  మే 15 వరకు జరిగిన ప్రమాదాల్లో 76 తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఎని మిది గంటల మధ్య చోటుచేసుకున్నవేనని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.

 

 85 లక్షల వాహనాలున్న నగరంలో  ట్రాఫిక్ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య ఆరు వేల మంది మాత్రమే. వారిలో 4,500 మంది ఉదయం 7 గంటలనుంచి రాత్రి 12.30 గంటల వరకు విధుల్లో ఉంటున్నారు  నగరంలో శాస్త్రీయమైన డిజైన్ లేని రోడ్లు కూడా ఉన్నాయి. డిజైన్లు  శాస్త్రీయంగా లేనికారణంగా కొన్ని రోడ్లు ప్రమాదాలకు ణమవుతున్నాయంటున్నారు. డిజైన్ శాస్త్రీయంగా లేనికారణంగా ప్రమాదాలకు  నెలవులుగా మారిన  21 ప్రదేశాలు నగరంలో ఉన్నాయంటున్నారు. శాస్త్రీ చౌక్, ఆశ్రం చౌక్, ముకర్బాచౌక్, సీలంపుర్ మూల్ చంద్ ఫ్లైఓవర్ల డిజైన్లు శాస్త్రీయంగా లేవంటున్నారు. ఐఎస్‌బీటీ కాశ్మీరీ గేట్, ముకర్బాచౌక్, ముకుంద్‌పుర్, నాంగ్లోయ్ డీటీసీ బస్ డిపో, జహంగీర్‌పురి బస్టాండ్, సీఎన్‌జీ పెట్రోల్ బంకు, సంజయ్‌గాంధీ ట్రాన్స్‌పోర్ట్‌నగర్, ఆజాద్‌పుర్ సబ్జీ మండీ, పంజాబీ బాగ్ చౌక్, నిగంబోధ్ ఘాట్, శ్యామ్‌లాల్  కాలేజీ పరిసరాలు ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలని పోలీసు నివేదికలు చెబుతున్నాయి.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top