వైరల్ : ఈ సారు రూటే సపరేటు..

Orissa Teacher Unique Style Of Teaching As A Dancing sir - Sakshi

భువనేశ్వర్‌ : ప్రఫుల్ల కుమార్‌ పతిలాంటి గురువులున్నంత వరకు చదువంటే పిల్లలకు బోరుకొట్టదు. బడి ఎగ్గొట్టాలనే ఆలోచనే రాదు. ఎందుకంటే ఆయన చదువుచెప్పే విధానం అలాంటిది. చదువును కూడా పిల్లలు అమితంగా ఇష్టపడేలా ఆటలరూపంలో.. పాటల రూపంలోనూ చెబుతూ పిల్లకాయల మనసుతో పాటు నెటిజన్ల మనసులను సైతం గెలుచుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా కోరపుట్‌ జిల్లాకు చెందిన ప్రఫుల్ల కుమార్‌ పతి లాంటపుత్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో ఇన్‌ఛార్చి హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అందరిలా చదువు చెబితే పిల్లల బుర్రకెక్కదని ఆలోచించిన ఆయన వారు చదువును ఇష్టపడేలా చేసేందుకు తనదైన శైలిని ఎంచుకున్నారు. పుస్తకాలలోని పాఠ్యాంశాలను పాటల రూపంలో తాను డ్యాన్స్‌ చేస్తూ పిల్లలతో డ్యాన్స్‌ చేయిస్తూ వారి బుర్రలోకి ఎక్కిస్తున్నాడు. ఆయన పిల్లలకు చదువు చెబుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో ఆయనని అందరూ ‘డాన్సింగ్‌ సర్‌’ అంటూ పొగిడేస్తున్నారు. దీనిపై డాన్సింగ్‌ సర్‌ ప్రఫుల్ల కుమార్‌ పతి మాట్లాడుతూ.. ‘‘  చదువనేది చాలా సరదాగా ఉండాలి. అందుకే నేను చదువు చెప్పే విధానాన్ని మార్చుకున్నాను. దీంతో పిల్లలు చాలా ఉత్సాహంగా, ఎంతో ఆసక్తితో చదువుకోవటం ప్రారంభించారు. పాఠశాలకు రావటానికి కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు నిద్రపోయే అవకాశం ఉంది. అందుకే  డాన్స్‌ ద్వారా పాఠాలు చెప్పటంతో వారు కచ్చితంగా నిద్రపోర’’ని అన్నారు. ప్రఫుల్ల చదువుచెబుతున్న విధానం కారణంగా పిల్లలు బడి మానుకోవటం తగ్గిందని ఆ పాఠశాలలో పని చేస్తున్న తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

చదవండి : మహిళ అతి తెలివి.. గోధుమ పిండితో..

ఆఖరి క్షణాలు.. ‘నాకు చావాలని లేదు’..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top