హిందూ జాగరణ్‌ మంచ్‌ కార్యకర్త హత్య | Murder of Hindu Jagran Munch activist - Sakshi
Sakshi News home page

హిందూ జాగరణ్‌ మంచ్‌ కార్యకర్త హత్య

Dec 26 2019 8:06 AM | Updated on Dec 26 2019 11:01 AM

Hindu Jagaran Mancha worker murdered in Nadia - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెంగాల్‌లో హిందూ జాగరణ్‌ మంచ్‌ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు.

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో నదియా జిల్లా కళ్యాణి ప్రాంతంలో హిందూ జాగరణ్‌ మంచ్‌కు చెందిన కార్యకర్త (27) దారుణ హత్యకు గురైన ఘటన వెలుగుచూసింది. బాధితుడి మృతదేహం, బైక్‌ను మంగళవారం రాత్రి కళ్యాణి ప్రాంతంలోని అతడి ఇంటికి కొద్దిదూరంలో పోలీసులు గుర్తించారు. ఫోన్‌ కాల్‌ రావడంతో బాధితుడు హుటాహుటిన బయలుదేరారని కొద్దిసేపటికే అతడి మృతదేహం స్ధానిక ప్రాథమిక పాఠశాల వద్ద పడిఉందనే సమాచారం అందిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పకడ్బందీ ప్రణాళిక ప్రకారం హత్య జరిగిందని మృతుని సోదరుడు ఆరోపించారు. బాధితుడు హిందూ జాగరణ్‌ మంచ్‌ కార్యకర్త కాగా తమ పార్టీలో చేరాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు కోరారని సమాచారం. తృణమూల్‌లో చేరేందుకు నిరాకరించడంతో హత్యకు పాల్పడ్డారని హిందూ జాగరణ్‌ మంచ్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement