ఏవియేషన్‌ స్కామ్‌లో చిదంబరానికి ఈడీ నోటీసులు

ED Sends Notice To Former FM Chidambaram In Aviation Scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏవియేషన్‌ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. బోయింగ్‌, ఎయిర్‌బస్‌ల నుంచి రూ 70,000 కోట్లకు విమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ కేసులో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి ప్రఫుల్‌ పటేల్‌కు సీబీఐ గత వారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు నష్టం వాటిల్లేలా చర్యలు చేపట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. ఈ స్కామ్‌ జరిగిన సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా, ప్రఫుల్‌ పటేల్‌ పౌరవిమానయాన మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఎయిర్‌ ఇండియాను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌ విమానయాన సంస్థలకు ఆయన అనుకూలంగా వ్యవహరించారని, ఏవియేషన్‌ లాబీయిస్ట్‌ దీపక్‌ తల్వార్‌తో టచ్‌లో ఉన్నారని ప్రఫుల్‌ పటేల్‌పై ఆరోపణలున్నాయి. విదేశీ ఎయిర్‌లైన్స్‌కు ప్రయోజనాలు దక్కేలా తల్వార్‌ పటేల్‌తో చర్చలు జరిపారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2004 నుంచి 2011 మధ్య పటేల్‌ పౌర విమానయాన మంత్రిగా వ్యవహరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top