మంత్రిగారు మామూలు ప్రయాణికుడిలా.... | Civil aviation minister travels like ordinery citizen | Sakshi
Sakshi News home page

మంత్రిగారు మామూలు ప్రయాణికుడిలా....

Aug 4 2014 11:35 AM | Updated on Sep 2 2017 11:22 AM

మంత్రిగారు మామూలు ప్రయాణికుడిలా....

మంత్రిగారు మామూలు ప్రయాణికుడిలా....

కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మంత్రిగా స్పెషల్ హోదాని ఉపయోగించుకోకుండా సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించడం ఇప్పుడు వార్త అయింది.

కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మంత్రిగా స్పెషల్ హోదాని ఉపయోగించుకోకుండా సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించడం ఇప్పుడు వార్త అయింది.


మంత్రిగా ఆయనకు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఓ ప్రత్యేక వాహనంలో ఆయన్ను విమానం దగ్గరకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు ఉంటాయి. కానీ అశోక్ గజపతి రాజు వాటిని పక్కనపెట్టి, మిగతా ప్రయాణికులలాగా బస్సులో విమానం వద్దకు రావడం, క్యూలో నిలుచోవడం చేస్తున్నారు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ లేదు. ఏ విమానయాన శాఖ మంత్రీ ఇలాచేయలేదు.


మంత్రులు, ఎంపీల వల్ల విమానాలు ఆలస్యం కావడం మామూలైపోయిన ఈ రోజుల్లో విమానయాన శాఖ మంత్రి వ్యవహార శైలి ఇప్పడు ఇది హాట్ టాపిక్ అయి కూచుంది.

Advertisement
 
Advertisement
Advertisement