సెల్యూట్‌ ఆకాశ్‌ జీ...!! | BJP MLA Akash Vijayvargiya Posters Shock Indore | Sakshi
Sakshi News home page

బ్యాట్‌తో వీరంగం; ప్రశంసలు!

Jun 28 2019 1:22 PM | Updated on Jun 28 2019 1:23 PM

BJP MLA Akash Vijayvargiya Posters Shock Indore - Sakshi

భోపాల్‌ : ప్రభుత్వ ఉద్యోగిని బ్యాట్‌తో చితకబాదిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌వర్గారియాను ప్రశంసిస్తూ పోస్టర్లు వెలిశాయి. అంతేగాక ఆయనకు మద్దతు తెలుపుతూ ప్రదర్శన నిర్వహించాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించాయి. ఇండోర్‌లోని ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వోద్యోగిపై ఆకాశ్‌ బుధవారం క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా బీజేపీ తమకు మొదట అభ్యర్థించాలని, తర్వాత దాడి చేయాలన్న సిద్ధాంతాన్ని నేర్పిందని ఆకాశ్‌ తన చర్యను సమర్థించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. ఈ నేపథ్యంలో జూలై 7 వరకు కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించింది.

చదవండి : రెచ్చిపోయిన ఎమ్మెల్యే

కాగా ఆకాశ్‌ చర్యను పలువురు బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు. అంతేగాకుండా ఆయనను ప్రశంసిస్తూ.. ‘సెల్యూట్‌ ఆకాశ్‌ జీ’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సదరు స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడినందునే ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించి కూల్చివేతకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ ర్యాలీలో ఇండోర్‌ మేయర్‌ కూడా పాల్గొననుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement