ఇచ్చినమాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra Tweet Helps Tamil Nadu Woman To Get Gas Connection - Sakshi

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర తన మాట నిలబెట్టుకున్నారు. రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదవారి ఆకలి తీరుస్తూ 'ఇడ్లీ బామ్మగా' పేరు పొందిన తమిళనాడుకు చెందిన కమలాతాళ్‌కు వంటగ్యాస్‌ కనెక‌్షన్‌ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేదలకు తక్కువ ధరలోనే రుచికరమైన టిఫిన్స్‌ అందించడం కోసం కట్టెల పొయ్యితో కష్టపడుతున్న కమలాతాళ్‌కు వంటగ్యాస్‌ కొనిస్తానని ఆనంద్‌ మహీంద్రా బుధవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.  తాజాగా ఆయన ట్వీట్‌ చేసిన మరుసటిరోజే కమలాతాళ్‌కు వంటగ్యాస్‌ కనెక‌్షన్‌ అందించినట్లు కోయంబత్తూర్‌ భారత్‌గ్యాస్‌ విభాగం మహీంద్రాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆనంద్‌ మహీంద్రా ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజంగా అద్భుతం.. కమలాతాళ్‌కు వంటగ్యాస్‌ను కానుకగా ఇచ్చిన కోయంబత్తూర్‌ భారత్‌ గ్యాస్‌ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. 'ఆమెకు అండగా ఉంటానని.. నేను ఇదివరకే చెప్పానుగా.  ఇక మీదట ఆమె వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తానంటూ' రీట్వీట్‌ చేశారు. (చదవండి : ఆ అవ్వ వ్యాపారంలో పెట్టుబడి పెడతా!)  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top