కోడలు కృష్ణతో ప్రియాంక.. ఫొటోలు వైరల్‌ | Priyanka Chopra niece makes her look like a princess | Sakshi
Sakshi News home page

అందమైన యువరాణిగా ప్రియాంక

May 5 2020 11:09 AM | Updated on May 5 2020 11:18 AM

Priyanka Chopra niece makes her look like a princess - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియాలో తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను తరచు అభిమానులతో పంచుకుంటూ అలరిస్తారు. ఇక కరోనా వైరస్‌ కారణంగా ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనస్‌ జంట అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో  ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు  ఫోటోలను పోస్ట్‌ చేశారు. ‘ఈ ఏడాదిలో మే మొదటి సోమవారం రోజున సృజనాత్మకంగా చిన్నారి కోడలు కృష్ణ తయారు చేసిన అందమైన యువరాణి’ అని ఓ ఫొటోకి కామెంట్‌ జత చేశారు ప్రియాంక. (బోల్డ్‌ క్యారెక్టర్‌కు ఓకే చెప్పిన హెబ్బా)

ఈ ఫొటోలో ప్రియాంక కోడలు చిన్నారి కృష్ణ.. తనకు చిన్ని కిరిటాన్ని తొడిగినట్లు కనిపిస్తోంది. మరో ఫొటోలో కృష్ణ తన చిన్ని చేతులతో ప్రియాంక ఐ షాడోకు మేకప్‌ వేస్తుంది. ఇక మేకప్‌ అయిపోయిన అనంతరం తీసిన ఫొటోలో.. ప్రియాంక లిప్‌ స్టిక్‌ పెదవికి కిందికి జారుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు జత చేస్తున్నారు.  ‘సో క్యూట్‌, మేకప్‌ చివరి ఫొటో అద్భుతం, మేకప్‌ బాగుంది’  అని పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతకు ముందు ప్రియాంక తన కోడలితో  సరదాగా జిమ్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న విషయం తెలిసిందే. 

No gym, no problem. @sky.krishna @divya_jyoti

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement