ప్రభుదేవా కొత్త స్టెప్! | Prabhu Deva new step | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా కొత్త స్టెప్!

Jul 7 2015 11:28 PM | Updated on Sep 3 2017 5:04 AM

ప్రభుదేవా కొత్త స్టెప్!

ప్రభుదేవా కొత్త స్టెప్!

హిందీ సినీ రంగంలో దర్శకత్వంతో తెగ బిజీగా ఉన్న ప్రభుదేవా ఇప్పుడు తమిళంలో ఒక సినిమా నిర్మించనున్నారట! లక్ష్మణ్ దర్శకత్వంలో

 హిందీ సినీ రంగంలో దర్శకత్వంతో తెగ బిజీగా ఉన్న ప్రభుదేవా ఇప్పుడు తమిళంలో ఒక సినిమా నిర్మించనున్నారట! లక్ష్మణ్ దర్శకత్వంలో ‘జయం’ రవి నటించిన తాజా తమిళ హిట్ ‘రోమియో - జూలియట్’ చూసి, తెగ ఇంప్రెస్ అయిన ప్రభుదేవా అదే దర్శక - హీరోల కాంబినేషన్‌లో తమిళంలో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారట! ‘జయం’ రవి, విజయ్ సేతుపతి ఆ సినిమాలో నటించనున్నారు. ‘‘ప్రభుదేవా కోసం ‘రోమియో-జూలియట్’ స్పెషల్ షో వేశాం. ఆ సినిమా, అందులో దర్శకత్వ ప్రతిభ చూసి, దాన్ని వేరే భాషలో రీమేక్ చేయడానికి ప్రభుదేవా ముందుకొచ్చారు. ఇంతలో దర్శకుడు లక్ష్మణ్ కొత్త స్క్రిప్ట్ చెప్పారు. అది బాగా నచ్చి, వెంటనే ఆ స్క్రిప్ట్‌ను తానే వెండితెరపై నిర్మిస్తానని ప్రభుదేవా చెప్పారు’’అని కోడంబాకమ్ వర్గాల కథనం. మొత్తానికి, మంచి కథలు దర్శకుల్ని కూడా నిర్మాతలుగా మారుస్తాయి కదూ!
 

Advertisement
 
Advertisement
Advertisement