వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

Prabhas 60 Feets Cut Out In Saaho Pre Release Event In Hyderabad - Sakshi

కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలి డ్యూడ్‌.. అంటూ మిర్ఛి సినిమాలో ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ను ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి డైలాగ్‌ చెప్పిన ప్రభాస్‌కు ఆయన ఫ్యాన్స్‌ భారీ కటౌట్‌ను ఏర్పాటుచేశారు. ప్యాన్‌ ఇండియా మూవీగా భారీ హైప్‌ క్రియేట్‌చేసిన సాహో రిలీజ్‌కు సిద్దమవుతోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కు భారీ​ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆదివారం సాయంత్రం సాహో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి అభిమానులు తండోపతండాలుగా రావడంతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఈ ఈవెంట్‌లో ఆయన అభిమానులు అరవై అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కటౌట్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 30న అభిమానుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top