చిరుకు జోడీ కుదిరింది | Nayanthara Allotted Dates for Chiranjeevi 150th Movie | Sakshi
Sakshi News home page

చిరుకు జోడీ కుదిరింది

Mar 16 2016 12:12 PM | Updated on Sep 3 2017 7:49 PM

చిరుకు జోడీ కుదిరింది

చిరుకు జోడీ కుదిరింది

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయం పై క్లారిటీ లేకపోయినా ఏదో ఇక రూపంలో ఈ సినిమాకు భారీ ప్రచారమే లభిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన...

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంపై క్లారిటీ లేకపోయినా ఏదో ఒక రూపంలో ఈ సినిమాకు భారీ ప్రచారమే లభిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని, ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. కథ కూడా ఫైనల్ కావటంతో ఇప్పుడు నటీనటుల ఎంపిక మీద దృష్టిపెట్టారు.

తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను చిన్నపాటి మార్పులతో చిరు హీరోగా రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో చిరంజీవి హీరోగా ఠాగూర్ లాంటి ఘన విజయం సాధించిన వివి వినాయక్, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కథ కథనాలు కూడా ఫైనల్ అయ్యాయన్న టాక్ వినిపిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్గా నయనతారను ఫైనల్ చేశారు.

ప్రస్తుతం సౌత్లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్గా ఉన్న నయన్, ఈ సినిమాతో తొలిసారిగా మెగాస్టార్తో జోడీ కడుతోంది. చిరు వయసు దృష్ట్యా హీరోయిన్గా నయన్ అయితేనే కరెక్ట్ అని భావించిన చిత్రయూనిట్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరి నయన్ను హీరోయిన్గా ఎంపిక చేశారట. ఇప్పటికే మే నెలలో షూటింగ్ నిమిత్తం నయన్ డేట్స్ కూడా ఇచ్చేసిందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement