‘భారతీయుడు 2’లో చాన్స్‌ కొట్టేసింది..! | Kajal to Romance Kamal Haasan in Bharateeyudu Sequel | Sakshi
Sakshi News home page

Oct 31 2018 11:21 AM | Updated on Oct 31 2018 11:21 AM

Kajal to Romance Kamal Haasan in Bharateeyudu Sequel - Sakshi

లోక నాయకుడు కమల్‌ హాసన్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్‌ అగర్వాల్ నటించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. తెలుగులో చిరంజీవి లాంటి సీనియర్ల సరసన నటించిన కాజల్‌, కమల్‌ సరసన నటించే అవకాశం రావటంతో వెంటనే ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement