నాది నీరులాంటి స్వభావం

I love doing new roles from time to time Says Rashmika Mandanna - Sakshi

టాలీవుడ్‌లో అగ్రహీరోల సరసన వరుస అవకాశాలు కొట్టేస్తూ టాప్‌ హీరోయిన్‌ జాబితాలో ప్రేక్షకుల చేత పేరు రాయించుకున్నారు రష్మికా మందన్నా. నటిగా మంచి స్థాయికి చేరుకున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు రష్మిక బదులిస్తూ....‘‘నేను ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేయడానికే ఇష్టపడతాను. ప్రయోగాత్మక పాత్రలు చేస్తే నటిగా కొత్త మెళకువలు నేర్చుకోవచ్చు. ఇంకా కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఉన్నాను కాబట్టి ఏవైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది.

నా నుంచి దర్శకులు మంచి నటను రాబట్టుకోవాలని కోరుకుంటాను. అందుకే స్క్రిప్ట్‌లోని నా పాత్రకు సంబంధించి ఎంత పనిభారం ఉన్నా సంతోషంగా స్వీకరిస్తాను. నిజానికి నాది నీరులాంటి స్వభావం. నీరు ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర స్వరూపంలో కనిపిస్తుంది. నేను కూడా అలానే ఉంటాను. ఓ ఇరవై ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నటిగా నేను గర్వపడాలి. అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. అల్లుఅర్జున్, కార్తీ, ధృవసర్జా హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ ఈ ఏడాది కూడా రష్మికా ఫుల్‌బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top