మూడు నెలల్లో మూడు సినిమాలు | Gopichand Three Films in Queue Aaradugula Bullet, Gautham Nanda,Oxygen | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో మూడు సినిమాలు

Apr 27 2017 10:43 AM | Updated on Sep 5 2017 9:50 AM

మూడు నెలల్లో మూడు సినిమాలు

మూడు నెలల్లో మూడు సినిమాలు

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ వరుస రిలీజ్లకు రెడీ అవుతున్నాడు. తాజా చిత్రం గౌతమ్ నందతో పాటు చాలా కాలంగా

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ వరుస రిలీజ్లకు రెడీ అవుతున్నాడు. తాజా చిత్రం గౌతమ్ నందతో పాటు చాలా కాలంగా చిత్రీకరణ దశలోనే ఉన్న మరో రెండు చిత్రాలను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు. ముందుగా సీనియర్ దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్లో ఉన్నాడు. గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా మే 3న రిలీజ్ కానుంది.

ఆ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న గౌతమ్ నంద సినిమాను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు. ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ అయిన నెల రోజుల తరువాత గౌతమ్ నంద రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తరువాత చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆక్సిజన్ రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆక్సిజన్ను జూలై లేదా.. ఆగస్టులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement