గోపిచంద్కి లైన్ క్లియర్..! | gopichand getting solo release for Gautham Nanda | Sakshi
Sakshi News home page

గోపిచంద్కి లైన్ క్లియర్..!

Jul 22 2017 12:35 PM | Updated on Sep 5 2017 4:38 PM

గోపిచంద్కి లైన్ క్లియర్..!

గోపిచంద్కి లైన్ క్లియర్..!

బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరో గోపిచంద్ తాజా చిత్రం గౌతమ్నంద్. మాస్ సినిమాల స్పెషలిస్ట్

బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరో గోపిచంద్ తాజా చిత్రం గౌతమ్నంద్. మాస్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెలఖరున రిలీజ్ అవుతోంది. గోపిచంద్ సరసన హన్సిక, కేథరిన్ థెరిస్సాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను భారీ బడ్జెట్ తోప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తన కెరీర్ కు కీలకమైన సినిమా కావటంతో గోపిచంద్ కూడా ఈ సినిమాపై చాలా కేర్ తీసుకున్నాడు.

అయితే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సమయంలో భారీ పోటి మధ్య గౌతమ్నంద రిలీజ్ అవుతుందని భావించారు. కానీ జూలై 28న రిలీజ్ కావాల్సిన మిగతా సినిమాలు బరిలో నుంచి తప్పుకోవటంతో గోపిచంద్ కి లైన్ క్లియర్ అయ్యింది. అదే రోజు రిలీజ్ అవుతుందని భావించిన కృష్ణవంశీ నక్షత్రం ఆగస్టు 4కు వాయిదా పడింది. మరో సినిమా విఐపి 2 తమిళ వర్షన్ వాయిదా పడటంతో తెలుగు వర్షన్ కు వాయిదా వేయటం కన్ఫామ్ అయ్యింది. దీంతో సోలోగా బరిలో దిగుతున్న గోపిచంద్, గౌతమ్ నందగా బిగ్ హిట్ కొడతాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement