ఆ అబ్బాయితో ఢీ

ఆ అబ్బాయితో ఢీ


 ఓ అబ్బాయి, అమ్మాయి ఆఫీసులో కలిసి పనిచేస్తూ ఉంటారు. వారిద్దరి మధ్య వృత్తిపరంగా ఓ గొడవ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘ఢీ అంటే ఢీ’. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయదర్శ కత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -‘‘చిన్న వయసులోనే శ్రీకాంత్ వందకు పైగా సినిమాలు చేశారు.

 

 ఈ నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు’’ అని చెప్పారు. ‘‘చక్రిగారు ఈ సినిమాకు మంచి పాటలు అందించారు. ఇప్పుడు ఆయన లేకపోవడం దురదృష్టకరం’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘భూపతి కథ చెప్పినప్పుడు శ్రీనివాసరావు గారికి ఈ సినిమా బాగా నచ్చి, ఆయనే నిర్మాతగా మారారు. ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు పోసాని కృష్ణమురళి, రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top