అతను ది బెస్ట్‌ కిస్సర్‌ | Deepika Padukone reveals the 'best kisser' in the industry. Any guesses | Sakshi
Sakshi News home page

అతను ది బెస్ట్‌ కిస్సర్‌

Jan 26 2018 1:21 AM | Updated on Jan 26 2018 1:24 AM

Deepika Padukone reveals the 'best kisser' in the industry. Any guesses - Sakshi

...అంటూ బోల్డ్‌గా సమాధానం చెప్పేశారు దీపికా పదుకొన్‌. ‘ఓగ్‌ బీఎఫ్‌ఎఫ్‌’ షోలో భాగంగా నేహా ధూపియా ‘ఇండస్ట్రీలో ది బెస్ట్‌ కిస్సర్‌ ఎవరు’ అని అడిగితే సూటిగా సుత్తి లేకుండా ‘రణ్‌వీర్‌ సింగ్‌ ఈజ్‌ ది బెస్ట్‌ కిస్సర్‌ ఇన్‌ బిజినెస్‌ (సినిమాలు)’ అని సమాధానం ఇచ్చారు దీపికా పదుకోన్‌. విశేషం ఏంటంటే... ఇదివరకు ఓసారి ఇదే ప్రశ్నను రణ్‌వీర్‌ సింగ్‌ ముందుంచితే ‘దీపిక పదుకోన్‌’ పేరే చెప్పారు. పేరు మాత్రమే చెప్పి ఊరుకోకుండా ‘‘కావాలంటే ‘రామ్‌లీల’ సినిమాలో ‘అంగ్‌ లగాదే..’ పాటలో మా కెమిస్ట్రీ చూడండి’’ అని ఓ ఎగ్జాంపుల్‌ కూడా చెప్పారు రణ్‌వీర్‌. ‘‘మీకు రణ్‌వీర్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయిందట.

నిజమేనా?’’ అని దీపికాను నేహా అడగ్గా..  ‘ఇంకా ఎంగేజ్‌ అవ్వలే దు’ అని తడుముకోకుండా అన్నారు. మేం నమ్మం.. ఏదీ.. మీ వేలు ఇలా చూపించండి’ అంటూ దీపిక చేతులను చెక్‌ చేశారు నేహా. ‘ఉంగరం వేలికి టాన్‌ లైన్‌ (ఉంగరం పెట్టుకున్న ఆనవాళ్లు) ఉందని తమాషా చేశారు నేహా ధూపియా. ఇదే షోలో దీపికాతో పాటు ఆమె సోదరి అనీషా పదుకోన్‌ కూడా పాల్గొన్నారు. ‘‘తను ఇప్పుడు కాదు.. నాలుగేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా ఎంగేజ్‌ అయ్యే ఉంది’’ అన్నారు అనీషా నవ్వేస్తూ. రణ్‌వీర్‌తో దీపిక ప్రేమలో పడి దాదాపు నాలుగేళ్లు అయ్యుంటుంది. ఆ విషయాన్నే ఈ విధంగా అనీషా చెప్పి ఉంటారని ఊహించవచ్చు.

దీపికా ముక్కు, చెవికి కోటి!
ఈ విషయం ఇలా ఉంచితే అన్ని అడ్డంకులు దాటుకొని ‘పద్మావత్‌’  సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు పై దాడులు చేస్తున్నారు. దీపికా పదుకోన్‌ ముక్కు,^ ð వి కోసి ఇస్తే కోటి రూపాయిలు నజరానా అని సంచలన వ్యాఖ్యలు చేశారు క్షత్రియ కమ్యూనిటీ ప్రెసిడెంట్‌ గజేంద్ర సింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement