ఎప్పుడైనా సిద్ధం! | D Ante D Brahmanandam's role as a special attraction | Sakshi
Sakshi News home page

ఎప్పుడైనా సిద్ధం!

Sep 16 2014 12:32 AM | Updated on Sep 2 2017 1:25 PM

ఎప్పుడైనా సిద్ధం!

ఎప్పుడైనా సిద్ధం!

ఎలాంటి సవాల్ అయినా ఎదుర్కోవడానికి అతను ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటాడు. అసలు అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు?

 ఎలాంటి సవాల్ అయినా ఎదుర్కోవడానికి అతను ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటాడు. అసలు అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఢీ అంటే ఢీ’. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా స్వీయదర్శకత్వంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నాయకా నాయికలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ పాటకు ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. 24న ప్రత్యేక పాట చిత్రీకరణను ఆరంభిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. శ్రీకాంత్ మంచి పాత్ర చేస్తున్నారు. బ్రహ్మానందం పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘భూపతిరాజా అద్భుతమైన కథ అందించారు. ఆ కథను శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న విధానం బాగుంది. కొత్త తరహా చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్, సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జి. లక్ష్మణ్‌రెడ్డి, సి.ఎన్. రెడ్డి, జి. జ్యోతిక.
 

Advertisement
 
Advertisement
Advertisement