సూర్యుడంటే పడదు... | cannot withstand in sunlight | Sakshi
Sakshi News home page

సూర్యుడంటే పడదు...

Feb 27 2015 10:34 PM | Updated on Sep 2 2017 10:01 PM

సూర్యుడంటే పడదు...

సూర్యుడంటే పడదు...

ఆ యువకుడి పేరు సూర్య. కానీ అతనికి సూర్యుడంటే అస్సలు పడదు. పగలు బయట అడుగు పెట్టాడంటే అతను చనిపోవాల్సిందే. అందుకే రాత్రుళ్లే సంచరిస్తుంటాడు.

ఆ యువకుడి పేరు సూర్య. కానీ అతనికి సూర్యుడంటే అస్సలు పడదు. పగలు బయట అడుగు పెట్టాడంటే అతను చనిపోవాల్సిందే. అందుకే రాత్రుళ్లే సంచరిస్తుంటాడు. మరి అతను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేది తెలియాలంటే ‘సూర్య వెర్సెస్ సూర్య’ చూడాల్సిందే. సురక్ష్ ఎంటర్‌టైనమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటడ్ పతాకంపై నిఖిల్, త్రిద జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ -‘‘ప్రేమ కథా నేపథ్యంలో వచ్చే ఓ విభిన్న చిత్రమిది. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాలను మించి పెద్ద హిట్ అవుతుంది’’ అని తెలిపారు. సూర్యుడికి, సూర్యకి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రమని దర్శకుడు పేర్కొన్నారు. రచయిత చందు మొండేటి మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రాలకు, పాటలకు మంచి స్పందన వస్తోంది. నిఖిల్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రం అవుతుంది’’అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 700 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement