
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన బన్నీ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. బన్నీ 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో బన్నీ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
Important update for all the fans and film lovers regarding #AA19.
— Haarika & Hassine Creations (@haarikahassine) 10 July 2019
The #TrivikramSrinivas directorial starring Stylish Star @alluarjun and @hegdepooja will release for Sankranthi 2020.
Let's celebrate this festival with our family!@MusicThaman #PSVinod @GeethaArts @vamsi84 pic.twitter.com/2jajh0k2s3