ఏసీకే, టింకిల్‌ 30 రోజులు ఉచితం | ACK And Tinkle Comics Made Available Free to Help With Social Distancing | Sakshi
Sakshi News home page

ఏసీకే, టింకిల్‌ 30 రోజులు ఉచితం

Mar 21 2020 6:03 AM | Updated on Mar 21 2020 6:06 AM

ACK And Tinkle Comics Made Available Free to Help With Social Distancing - Sakshi

రానా

‘ఏసీకే (అమర్‌ చిత్ర కథ), టింకిల్‌’ యాప్స్‌లోని కంటెంట్‌ను 30రోజుల పాటు ఉచితంగా తిలకించవచ్చని హీరో రానా ప్రకటించారు. ఆ రెండు యాప్స్‌ ఆయనవే. కరోనా వైరస్‌ ప్రభావంతో సినిమా సహా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇం డస్ట్రీ మొత్తం కార్యకలాపాల్ని నిలిపివేసింది. థియేటర్లు మూతపడ్డాయి. కరోనా వైరస్‌ భయంతో ప్రజలు ఇళ్లల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో వారికి బుల్లితెర మాత్రమే వినోదాన్ని పంచుతోంది. అందుకే దేశవ్యాప్తంగా ‘ఏసీకే (అమర్‌ చిత్ర కథ), టింకిల్‌’ యాప్స్‌ని ఉచితంగా చూసే అవకాశం కల్పించారాయన. ‘‘ఏసీకే విషయంలో ఈ నెలలో ఆ¯Œ లైన్‌ సభ్యత్వాలను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఏసీకే, టింకిల్‌ యాప్స్‌లోని కంటెంట్‌ను పిల్లలు, పెద్దలు ఉచితంగా చూసుకోవచ్చు. మన గతం గురించి తెలుసుకొని, భవిష్యత్తును నిర్మించుకోవడానికి నేటి తరానికి ఇది చాలా ముఖ్యం’’ అన్నారు రానా. ఇదిలా ఉంటే రానా హీరోగా తెరకెక్కిన ‘అరణ్య’ చిత్రం విడుదల వాయిదా పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement