హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

Pakistans Anti Terror Court Grants Bail To Hafiz Saeed - Sakshi

ఇస్లామాబాద్‌ : ముంబై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు పాకిస్తాన్‌ కోర్టు సోమవారం వెయిల్‌ మంజూరు చేసింది. ఉగ్రవాద సంస్థలు, ఉగ్ర కార్యకలాపాలను పాక్‌ భూభాగం నుంచి నిరోధించాలని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో హఫీజ్‌ సయీద్‌కు పాక్‌ కోర్టు బెయిల్‌ మంజూరు కావడం గమనార్హం.

హఫీజ్‌ సయీద్‌ ఉగ్రవాద సంస్ధలకు నిధులు సమకూరుస్తున్నారని గత నెల ఆయనపై కేసు నమోదైంది. హఫీజ్‌పై పాకిస్తాన్‌లో 23 ఉగ్రవాద సంబంధిత కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు ఎదుట ప్రభుత్వం సరైన ఆధారాలు చూపకపోవడంతో హఫీజ్‌కు బెయిల్‌ మంజూరైంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top