వామ్మో.. ఇంత భయంకరమైన ఫొటో! | Baby Monitor Photo Goes Viral Netizens Says Its Terrifying | Sakshi
Sakshi News home page

అసలు విషయం తెలిసి నవ్వొచ్చింది!

Nov 18 2019 4:04 PM | Updated on Nov 18 2019 7:41 PM

Baby Monitor Photo Goes Viral Netizens Says Its Terrifying - Sakshi

‘నా కొడుకు కోసం కొత్త బేబీ మానిటర్‌ కొనుక్కుని రావడమే పెద్ద తప్పై పోయింది’ అంటూ ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు... అమ్మో.. ఇంత భయంకరంగా ఉంటే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. ఎల్సీ బానిస్టెర్‌ అనే మహిళ తన చిన్నారి పాపాయిని ఎల్లవేళలా పర్యవేక్షించేందుకు ఓ బేబీ మానిటర్‌ తీసుకువచ్చింది. అయితే ఓ రాత్రి వేళ అందులోని దృశ్యాలు చూసిన ఆమెకు సరిగ్గా నిద్రపట్టలేదు. బేబీ మానిటర్‌లో తన కొడుకు హార్రర్‌ సినిమాలోని దెయ్యంలా కనిపించడమే ఇందుకు కారణం. 

ఈ విషయం గురించి ఎల్సీ మాట్లాడుతూ... ‘ నా కొడుకు ఫిన్‌.. బేబీ మానిటర్‌ కెమెరా వైపు తొలిసారి చూసినపుడు నాకు భయం వేసింది. వాడి కళ్లు ఉబ్బిపోయినట్లుగా... చర్మమంతా నీలిరంగులో ఉండటంతో బెంబేలెత్తిపోయాను. ఆ దృశ్యాలు లో బడ్జెట్‌ సినిమాలా కనిపించాయి. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నాకు నవ్వొచ్చింది. ఈ కెమెరాలు అసలు ఇలా ఎందుకు ఉంటాయో కదా. బేబీ మానిటర్‌లో ఉన్న ఫిన్‌ ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాను. అంతే ఇది ఇంతగా వైరల్‌ అవుతుందనుకోలేదు’ అని పేర్కొంది. కాగా ఫిన్‌లాగే తమ పిల్లలు కూడా బేబీ మానిటర్‌ బాధితులే అంటూ సరదాగా పేర్కొంటున్న నెటిజన్లు.. అయితే వాళ్ల కంటే ఫిన్‌ ఫొటోను అత్యంత భయంకరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement