ప్రగతి నగర్‌లో భారీ ట్రాఫిక్ జాం | heavy traffic jam in Pragati Nagar | Sakshi
Sakshi News home page

ప్రగతి నగర్‌లో భారీ ట్రాఫిక్ జాం

Sep 21 2016 10:33 AM | Updated on Sep 4 2017 2:24 PM

హైదరాబాద్ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని కూకట్‌పల్లి ప్రగతినగర్ చెరువు పూర్తిగా నిండింది.

హైదరాబాద్ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని కూకట్‌పల్లి ప్రగతినగర్ చెరువు పూర్తిగా నిండింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద కొనసాగుతుండటంతో.. చెరువు సమీపంలోని రోడ్డు పైకి నీరు చేరింది. దీనికి తోడు భారీ వర్షాలకు రోడ్డు గుంతల మయమవడంతో.. భారీగా ట్రాఫిక్ జాం అయింది. బుధవారం ఉదయం పనులు నిమిత్తం బయటకు వస్తున్న వాహనదారులు ట్రాఫిక్ జాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రగతినగర్ చెరువు ప్రాంతంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

Advertisement
 
Advertisement
Advertisement