మర్చిపోకుండా చికిత్స! | forgetfulness treatment | Sakshi
Sakshi News home page

మర్చిపోకుండా చికిత్స!

Nov 3 2014 11:24 PM | Updated on Oct 3 2018 6:52 PM

మర్చిపోకుండా చికిత్స! - Sakshi

మర్చిపోకుండా చికిత్స!

మతిమరుపును గుర్తించడానికి కొత్తగా పరీక్షలెందుకు... అనిపించడం సహజమే. కానీ శాస్త్రబద్ధంగా చికిత్స చేయాలంటే మతిమరుపును నిర్ధారించే పరీక్షలు చేయాల్సిందే. అవి ఏమిటంటే...

నిర్ధారణ
మతిమరుపును గుర్తించడానికి కొత్తగా పరీక్షలెందుకు... అనిపించడం సహజమే. కానీ శాస్త్రబద్ధంగా చికిత్స చేయాలంటే మతిమరుపును నిర్ధారించే పరీక్షలు చేయాల్సిందే. అవి ఏమిటంటే...
* కుటుంబ చరిత్ర (రక్తసంబంధీకుల్లో ఎవరికైనా అల్జీమర్స్ ఉందేమోననే వివరాలు), ఆహారపు అలవాట్లు, మద్యపానం, ఇతర అనారోగ్యాలకు ఏవైనా మందులు వాడుతుంటే ఆ మందుల వివరాలను పరిశీలిస్తారు. రక్తపోటు, గుండె, ఊపిరితిత్తులు కొట్టుకునే వేగాన్ని గమనిస్తారు. సాధారణ ఆరోగ్యవివరాలను తెలుసుకుంటారు. వీటితోపాటు రక్తం, మూత్ర పరీక్షలు చేస్తారు.
* కండరాల శక్తిని, కంటి కదలికలు, మాట, స్పర్శ, చర్యకు ప్రతిచర్యలు ఎలా ఉన్నాయనేది గమనిస్తారు.
* నరాల వ్యాధి నిపుణులు... పార్కిన్‌సన్స్ (చేతులు, మెడ వణకడం), మెదడులో కణుతులు, మెదడులో నీరు చేరడం, జ్ఞాపకశక్తిని తగ్గించే ఇతర అనారోగ్యాలు, పక్షవాతం వంటివి ఉన్నాయేమోనని పరీక్షిస్తారు. సి.టి.స్కాన్, ఎమ్‌ఆర్‌ఐ పరీక్షలు చేసి బ్రెయిన్ ఇమేజింగ్ స్టడీ చేస్తారు.
* మెంటల్ స్టేటస్ టెస్ట్‌లు... చిన్న చిన్న లెక్కలను పరిష్కరించడం, ఒక విషయాన్ని విడమరిచి చెప్పడం, రోగి చేత ఆ రోజు తేదీ, సమయం, తాను ఎక్కడున్నాననే వివరాలు చెప్పించడం, కొన్ని పదాల పట్టిక ఇచ్చి వాటిని తిరిగి చెప్పించడం వంటి పరీక్షలు చేస్తారు.
* ఇంతగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మతిమరుపు ఉన్నట్లు నిర్ధారించి తగిన వైద్యం చేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement