‘రష్మిక చించావ్‌ పో’.. అది నేనన్లేదు

Jagtial Collector Ravi Tweet On Rashmika Post Viral - Sakshi

జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి సోషల్‌ మీడియా వేదికగా ఓ వివాదంలో ఇరుకున్నారు. మంగళవారం హీరోయిన్‌ రష్మిక మందన తన లేటెస్ట్‌ ఫోటోలను ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ ఫోటోలపై జగిత్యాల కలెక్టర్‌ పేరుతో వచ్చిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. రష్మికను ఉద్దేశించి.. చించేశావ్‌ పో అంటూ కలెక్టర్‌ రవి పేరుతో వచ్చిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బాధ్యతగల ఒక జిల్లా కలెక్టర్‌ ఈ విధంగా కామెంట్‌ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ట్వీట్‌పై కలెక్టర్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సంచలనం రేపిన ఈ ట్వీట్‌పై జగిత్యాల కలెక్టర్‌ రవి స్పందించారు. ఈ ట్వీట్‌ చేసింది తాను కాదని, తన ట్విటర్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రస్తుతం కలెక్టర్‌ ట్విటర్‌ అకౌంట్‌ను ఎవరు హ్యాక్‌ చేశారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 
చదవండి:
అది నా తప్పు కాదు, క్యారెక్టర్‌ అలాంటిది
పోర్న్‌ స్టార్‌గా దిగ్గజ దర్శకుడి కుమార్తె..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top