స్టార్‌ అంబాసిడర్‌, స్మార్ట్‌ఫోన్‌ గెల్చుకునే చాన్స్‌

 Realme ropes in Salman Khan as brand Ambassador         - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  స్మార్ట్‌ఫోన్‌ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన బ్రాండ్లను మరింత ప్రోత్సహించుకునే చర్యల్లోభాగంగా బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్ఖాన్‌ను తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ మేరకు రియల్‌మీ బుధవారం వెల్లడించింది. తమస్మార్ట్‌ఫోన్ల ప్రమోషన్‌కు సల్మాన్‌ఖానే ఉత్తమైన, సరియైన వ్యక్తిగా తాము భావించామని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ తెలిపారు. ముఖ‍్యంగా స్టైలిష్‌గా తీసుకొస్తున్న రియల్‌ మి సిరీస్‌  రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో ప్రమోషన్‌కు సల్మాన్‌ ఖాన్ ఆమోదించినున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ భాగస్వామ్యం కొత్త మైలురాయిని సూచిస్తుందని,  ఎందుకంటే  స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌తో పనిచేయడం ఇదే మొదటిసారని కంపెనీ తెలిపింది. ‘స్టే రియల్’ వైఖరితో మిలీనియల్స్ (యువత) లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.అంతేకాదు  రియల్‌ సల్మాన్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ప్రారంభించింది. యూజర్లు హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తే...రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకోవచ్చని ట్విటర్‌లో వెల్లడించింది. 

'డేర్ టు లీప్' అనే ట్యాగ్‌లైన్‌ తనకు బాగా కనెక్ట్‌ అయిందని బాలీవుడ్‌ నటుడు, నిర్మాత సల్మాన్‌ ఖాన్‌ తెలిపారు. తక్కువ వ్యవధిలో, మెరుగైన ఉత్పత్తులతో నాణ్యమైన బ్రాండ్‌గా నిరూపించకున్న ట్రాక్ రికార్డ్ రియల్‌మీ సొంతమన్నారు. రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటాయని తాను విశ్వసిస్తున్నానన్నారు. మిడ్-రేంజ్ ధరల విభాగంలో రియల్‌మి 6 సిరీస్ మార్చి5న  లాంచ్‌ కానుంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, రియల్‌మి 2019 లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. అలాగే భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నాల్గవ స్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా ఏడవ స్థానంలోనూ ఉంది.  కాగా ఇటీవల స్మార్ట్‌ టీవీల రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రియల్‌మీ, దేశంలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: స్మార్ట్‌టీవీ రంగంలోకి దూసుకొస్తున్న రియల్‌మీ) (రెండు సెల్ఫీ కెమెరాలు : రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top