ఐటీ రిటర్న్స్ ఈ-ఫైలింగ్ గడువు పొడిగింపు | IT returns E- filing deadline extension | Sakshi
Sakshi News home page

ఐటీ రిటర్న్స్ ఈ-ఫైలింగ్ గడువు పొడిగింపు

Sep 3 2015 12:44 AM | Updated on Sep 27 2018 4:47 PM

ఐటీ రిటర్న్స్ ఈ-ఫైలింగ్ గడువు పొడిగింపు - Sakshi

ఐటీ రిటర్న్స్ ఈ-ఫైలింగ్ గడువు పొడిగింపు

ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ ఈ-ఫైలింగ్ (2015-16 అసెస్‌మెంట్ ఇయర్) గడువును ప్రభుత్వం వారం రోజులు పొడిగించింది

 న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ ఈ-ఫైలింగ్ (2015-16 అసెస్‌మెంట్ ఇయర్) గడువును ప్రభుత్వం వారం రోజులు పొడిగించింది. దీని ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకూ ఈ-ఫైలింగ్ చేసుకునే వీలు కలుగుతోంది. నిజానికి ఈ గడువు ఆగస్టు 31తో ముగిసింది. అయితే చివరి రోజున ఎక్కువ మంది ఫైల్ చేయడానికి ప్రయత్నించటంతో కొన్ని ఈ-సేవలు ఆలస్యమయ్యాయి. దీంతో గడువు పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి దేశ వ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 4 కోట్లు. కాగా ఓటీపీ ఆధారిత ఐటీఆర్ ఫైలింగ్ సిస్టమ్ ద్వారా ఆగస్టు 31వ తేదీ నాటికి దాదాపు 29 లక్షల పన్ను రిటర్న్స్‌ను పరిశీలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement