ఆదాయపు పన్ను చెల్లింపులకు మొబైల్ యాప్! | Income Tax department is developing a mobile app for filing tax returns | Sakshi
Sakshi News home page

ఆదాయపు పన్ను చెల్లింపులకు మొబైల్ యాప్!

Nov 14 2015 8:18 PM | Updated on Sep 27 2018 4:47 PM

పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ ఓ మొబైల్ యాప్ను సిద్ధం చేస్తోంది.

ఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ ఓ మొబైల్ యాప్ను సిద్ధం చేస్తోంది. శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో పన్ను చెల్లింపుదారుల సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్( సీబీడీటీ) చైర్ పర్సన్ అనితా కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇటీవలి కాలంలో ఆన్లైన్ పన్నుల చెల్లింపు విధానం ఎక్కువగా వాడుకలో ఉంటున్నది. ఈ సరళికి అనుకూలంగా మొబైల్ యాప్ను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆమె తెలిపారు. అయితే యాప్ ద్వారా చెల్లింపులు చేపట్టడంలో ఎదురయ్యే భద్రతా పరమైన అంశాలకు సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి కృషి జరుగుతున్నట్లు తెలిపిన ఆమె త్వరలోనే యాప్ను పన్నుచెల్లింపుదారులకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement