మూడు బ్యాంకుల చీఫ్‌ల ఎంపికకు ఇంటర్వ్యూలు | Banks Board Bureau shortlists candidates for PSB chiefs | Sakshi
Sakshi News home page

మూడు బ్యాంకుల చీఫ్‌ల ఎంపికకు ఇంటర్వ్యూలు

May 17 2016 2:13 AM | Updated on Aug 20 2018 6:18 PM

మూడు బ్యాంకుల చీఫ్‌ల ఎంపికకు ఇంటర్వ్యూలు - Sakshi

మూడు బ్యాంకుల చీఫ్‌ల ఎంపికకు ఇంటర్వ్యూలు

మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓల ఎంపికకు సోమవారం బ్యాంక్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) ఇక్కడ 10 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది.

ముంబై: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓల ఎంపికకు సోమవారం బ్యాంక్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) ఇక్కడ 10 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. ఆర్‌బీఐ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరిగాయి. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు ఎండీ, సీఈఓ పోస్టులకు ఈ ఇంటర్వ్యూలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి హాజరయిన వారిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు ఉన్నారు. కాగ్ మాజీ చీఫ్ వినోద్‌రాయ్ నేతృత్వంలో  కార్యకలాపాలు చేపట్టిన బీబీబీ- బ్యాంక్‌ల చీఫ్‌ల ఎంపికకు జరిపిన తొలి ఇంటర్వ్యూ ఇది.

Advertisement
 
Advertisement
Advertisement