చిరంజీవి, బాలకృష్ణ ఎందుకు మాట్లాడరు? | why chiranjeevi, balakrishna can't speak on special status issue | Sakshi
Sakshi News home page

చిరంజీవి, బాలకృష్ణ ఎందుకు మాట్లాడరు?

Jan 22 2017 3:29 PM | Updated on Jul 24 2018 1:16 PM

చిరంజీవి, బాలకృష్ణ ఎందుకు మాట్లాడరు? - Sakshi

చిరంజీవి, బాలకృష్ణ ఎందుకు మాట్లాడరు?

ప్రజాప్రతినిధులుగా ఉన్న నందమూరి బాలకృష్ణ, చిరంజీవి ప్రత్యేకహోదా అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించింది.

విజయవాడ: ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆంధ్రప్రదేశ్‌ కు ఒక్క పైసా తేలేదని, అజ్ఞానంతో ఉన్నవారు మాత్రమే ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారని ఏపీ ప్రత్యేకహోదా, విభజన హామీల సమితి విమర్శించింది. ప్రజాప్రతినిధులుగా ఉన్న నందమూరి బాలకృష్ణ, చిరంజీవి ప్రత్యేకహోదా అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించింది. తమిళనాడు స్ఫూర్తితో ప్రత్యేకహోదా కోసం సినీపరిశ్రమ మద్దతు తెలపాలని కోరింది. ప్రత్యేకహోదా ఉద్యమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.

అధికారపక్ష ఎంపీలు ప్రధానమంత్రి ఇంటిముందు ధర్నాలు చేస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందని పేర్కొంది. పన్నీరు సెల్వం కంటే చంద్రబాబు పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని ఎద్దేవా చేసింది. జల్లికట్టును పట్టుబట్టి పన్నీరు సెల్వం సాధించారని తెలిపింది. అదే తరహాలో ప్రత్యేకహోదా సాధించేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని సాధన సమితి వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement