ఎమ్మెల్యే కాకానికి ఊరట | SC stops arrest of YSRCP MLA kakani | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కాకానికి ఊరట

Mar 10 2017 1:59 PM | Updated on Oct 22 2018 8:50 PM

ఎమ్మెల్యే కాకానికి ఊరట - Sakshi

ఎమ్మెల్యే కాకానికి ఊరట

సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

న్యూఢిల్లీ: సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేత సోమిరెడ్డి విదేశాల్లో అక్రమ ఆస్తులు కలిగి వున్నారని గోవర్ధన్‌ రెడ్డి గతంలో పలుమార్లు ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. కాగా, గోవర్ధన్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై సోమిరెడ్డి కోర్టులో కేసు వేశారు. గోవర్ధన్‌ రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు కాకానిని అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement