నేటి నుంచి ఇసుక అమ్మకాలు

Sand Sales From Today Visakha District - Sakshi

యూనిట్‌ ధర రూ.4,500 

జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌

మహారాణిపేట(విశాఖ దక్షిణ): సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా మంగళవారం నుంచి ఇసుకను సరఫరా చేస్తున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ వెల్లడించారు. సోమవారం తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇసుక కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు.

ఇసుక గురించి  ఎవరిని సంప్రదించాలంటే..
ఇసుక కోసం దరఖాస్తు చేయడంతోపాటు.. నిర్మాణానికి సంబంధించిన ఫొటో, ఫ్లాన్‌ అప్రూవల్, ఆధార్, రేషన్‌కార్డులను జత చేసి విశాఖ ఎంవీపీ కాలనీలోని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసు ఆఫీసు వద్ద మైన్స్‌ కార్యాలయంలో అందజేయాలి. అక్కడ రెవెన్యూ, పోలీసు, సిటీప్లానర్, మైన్స్‌శాఖ వారు దరఖాస్తులను పరిశీలన చేస్తారు.
ఎంత ఇసుక ఇస్తారు
దరఖాస్తును పరిశీలించి ఒక యూనిట్‌ (మూడు క్యూబిక్‌ మీటర్లు  ఒక ట్రాక్టర్‌ లోడ్‌) 4,500 రూపాయలు చెల్లిస్తే రశీదు ఇస్తారు.

ఎక్కడ ఇస్తారంటే..
రశీదు తీసుకొని ముడసర్లోవలోని ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద సిబ్బందికి రశీదు చూపించాలి. అక్కడ లారీ అసోసియేషన్‌ సెక్రటరీ కె.రమణ 
( ఫోన్‌ నంబరు 7674922888)ను సంప్రదించాలి. రవాణా చార్జీలు లబ్ధిదారులే  చెల్లించుకోవాలి.
-ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఫోన్‌ నంబర్‌ 9949610479
-సమస్య ఏమైనా వుంటే వారు మైన్స్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోట్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ 9949565479ను సంప్రదించాలి.
ఇసుకనిచ్చే సమయం..
మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు.
-రెండోసారి ఇసుక కావాలంటే భవనం పని జరిగిన కొత్త ఫొటో తీసి దరఖాస్తుతోపాటు ఎంవీపీ కాలనీలోని ఏడీ మైన్స్‌ కార్యాలయంలోనే అందజేయాలి.
కొత్త ఇసుక విధానం వచ్చే వరకు సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇసుక సరఫరా చేయనున్నట్టు జేసీ వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 84 యూనిట్లు అందుబాటులో ఉందని మైన్స్‌ఏడీ తమ్మినాయుడు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top