విశాఖపట్నానికి 1100 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వచ్చే 12 గంటల్లో తుఫాన్గా మారే అవకాశముంది.
విశాఖపట్నానికి 1100 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వచ్చే 12 గంటల్లో తుఫాన్గా మారే అవకాశముంది. కలింగపట్నం-పారాదీప్ వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ సమయంలో 175-185 కిలోమీటర్ల వేగంగా గాలులు వీసే అవకాశముంది.
తుఫాన్కు ఫైలిన్గా నామకరణం చేశారు. విశాఖపట్నంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల 25 సెం.మీ మేర భారీ వర్షం పడే అవకాశముందని అధికారులు తెలిపారు.