వైద్య కళాశాల బస్సు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాల బస్సు ప్రారంభం

Published Tue, May 6 2025 10:09 AM | Last Updated on Tue, May 6 2025 10:09 AM

వైద్య కళాశాల బస్సు ప్రారంభం

వైద్య కళాశాల బస్సు ప్రారంభం

సంగారెడ్డి జోన్‌: సమాజంలో మార్పునకు బాలికలు విద్యావంతులుగా ఎదగాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తోషిబా పరిశ్రమ సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా జోగిపేట ఆందోల్‌లోని ప్రభుత్వ నర్సి ంగ్‌ కళాశాలకు మంజూరైన బస్సును మంత్రి దామోదర, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, విద్యా ర్థులతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అంజయ్య, పరిశ్రమ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 55 అర్జీలు

సంగారెడ్డి జోన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేటు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ క్రాంతి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆర్జీలను స్వీకరించారు. సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు ప్రజలు వివరించారు. ఎన్నిసార్లు అధికారుల దగ్గరకు వెళ్లినా సమస్యలు పరిష్కారం కావటం లేదని తమ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, 55 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. డీఆర్‌ఓ పద్మజరాణి, అధికారులు పాల్గొన్నారు.

రాజ్యాంగ రక్షణే

కాంగ్రెస్‌ ధ్యేయం

స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేన రెడ్డి

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): రాజ్యాంగ రక్షణే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయమని స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేన రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వెంకటాపూర్లో జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ పాదయాత్రలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌ను గౌరవించుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్ను జాతీయ కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమమన్నారు. ఈ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్‌ రాంరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, కృష్ణ, హరి, ప్రేమానందం,రామ్‌ గౌడ్‌, కుమార్‌, పోచన్న, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల

నివారణకు చర్యలు

ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో తగు సూచనలు సలహాలు అందించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల విషయంలో సీఐ నయీముద్దీన్‌తో మా ట్లాడారు. ప్రమాదాలు జరగకుండా చర్య లు తీసుకోవాలని సూచించారు. జిన్నారం ట్రైనీ ఎస్‌ఐ చైతన్య కుమార్‌ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించండి

కేంద్రమంత్రి గడ్కరీకి ఐఎన్‌టీయూసీ వినతి

పటాన్‌చెరు టౌన్‌: ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఆర్డినెన్స్‌ పరిశ్రమలకు వర్క్‌ఆర్డర్లను పెంచి కార్మికులకు జీవనో పాధి కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీకి ఐఎన్‌ టీయూసీ జిల్లా అధ్యక్షు లు నరసింహారెడ్డి, ఎంపీ సురేష్‌ షెట్కార్‌తో కలిసి సోమవారం కేంద్రమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల ని కోరారు. ఆర్టికల్‌ 15 (5) ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసి విద్యార్దులకు రిజర్వేషన్లు కల్పించాలని జహిరాబాద్‌, సంగారెడ్డి పటాన్‌చెరు , నియోజకవర్గాలలో సుమారు నాలుగు లక్షల మంది కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యం అంతంత మాత్రమే అని సొంత భవనాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. అలాగే 28 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలని డిమాండ్‌ చేశారు.

బస్సును ప్రారంభిస్తున్న మంత్రి దామోదర, చిత్రంలో కలెక్టర్‌, విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement