
ఇంటర్నేషనల్ కరాటే సెమినార్‌లో ప్రతిభ
బెల్లంపల్లి: కేరళ రాష్ట్రంలో గతనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ ఇంటర్నేషనల్ సిటోరియా కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా టెక్నికల్ సెమినార్‌లో మాస్టర్లు ప్రతిభకనబర్చారు. పలు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పాల్గొనగా, రాష్ట్రం నుంచి ఏడుగురు మాస్టర్లు హాజరయ్యారు. టెక్నికల్ సెమినార్‌లో నైపుణ్యత కనబర్చిన మాస్టర్‌లకు జపాన్‌కు చెంనని కేఎస్‌కేఎస్‌ఐ ఫౌండర్ గ్రౌండ్ మాస్టర్ సోకే కేఎన్‌యూమ భూని ప్రతిభ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సర్టిఫికెట్లు అందుకున్న వారిలో రమేశ్‌కుమార్, విజ్జగిరి రవి, సారిక రాజు, మారపాక దేవయ్య, ఎస్.సురేశ్, సోలంకి అశోక్, నారాయణ శెట్టి శ్రీనివాస్ ఉన్నారు. వీరిని పలువురు అభినందించారు.