
మరిన్ని రహదారులు నిర్మించాలి
తెలంగాణ రాష్ట్రానికి పక్కన ఉన్న మహారాష్ట్రతో అనుసంధానిస్తూ మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో 300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. అదే తరహాలో ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్, ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అల్లాపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలి. తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
– ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్