
విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇటీవల విడుదలైన ఫలితాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ కుమార్‌దీపక్, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరిలతో కలిసి శాలువాలతో సత్కరించారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఎ.లిఖిత, షేక్ సీద్రాకొహిన్, బి.సాత్విక, ఎండీ.అజార్బీ, మహెక్ నజ్నిన్, జునైన సాబా, నిదాఫిర్దోస్, ఎన్.అభిరామ్, ఓ.సిద్ధు, బి.వరుణ్ తేజ, ఎండీ.అమన్, డి.అక్షయ, సుహైర్య, ఆర్.వైష్ణవి, డి.రిషిత, ఎస్ వైశాలి, ఎండీ.సమీర్, ఎండీ.ఫిరోజ్, ఎస్.రాంసూరిలను సన్మానించారు.
టాస్క్, ఏటీసీ సందర్శన
మందమర్రిరూరల్/మంచిర్యాలఅగ్రికల్చర్: మంచిర్యాల కలెక్టరేట్లోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ డిపార్టుమెంటు(టాస్క్), మందమర్రి మండల కేంద్రంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను సోమవారం ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సందర్శించారు. మంచిర్యాలలో యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, టాస్క్ ప్రతినిధి సాయికృష్ణ, ఏటీసీ ప్రిన్సిపాల్ దేవానంద్, అధికారులు పాల్గొన్నారు.