
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్ చేయనున్నట్లు, ఇది 2025 జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.
యూపీఐ వినియోగదారులు.. లావాదేవీలు చేయడానికి కనీసం 30 సెకన్ల సమయం కేటయించాల్సి ఉంది. ఈ సమయాన్ని తగ్గించడానికి NPCI చర్యలు తీసుకుంటోంది. ఇది అమలులోకి వచ్చిన తరువాత.. ట్రాన్సక్షన్స్ మరింత సులభతరం అవుతుంది.
ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
లావాదేవీలు, డెబిట్, క్రెడిట్ సేవల కోసం యూజర్ ఇప్పుడు 30 సెకన్ల సమయం వెచ్చించాల్సి ఉంది. దీనిని 15 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీలు చేయడానికి సంబంధించిన టైమ్ తగ్గితే.. యూజర్ల సమయం కూడా ఆదా అవుతుంది.