Single movie
-
ఆ మార్పు కి నేను సిద్ధంగా ఉన్నాను: హీరో శ్రీవిష్ణు
‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్ల అవుతుంది. ఈ పదహారేళ్లలో ఎక్కడ కూడా బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. రానున్న రొజులలో చాలా మార్పులు రాబోతున్నాయి. పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ రాబోతున్నారు. ఆ మార్పు కి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి క్యారెక్టర్ లో ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం #సింగిల్(#single movie). కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. మే9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో శ్రీవిష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ డైరెక్టర్ కార్తీక్ రాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఫైనల్ గా సినిమా చూసుకున్న తర్వాత చాలా పెద్ద ఎంటర్టైనర్ అవుతుందని అనిపించింది.ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఇదంతా టీమ్ ఎఫర్ట్ అని భావిస్తున్నాను.→ ఈ సినిమా క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. నా క్యారెక్టర్, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్ కి చాలా నచ్చుతాయి. క్లైమాక్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.→ సినిమాని కంప్లీట్ గా హైదరాబాద్ లో తీసాం. హైదరాబాద్‌ని చాలా కొత్తగా చూపించాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ని ఇంత కొత్తగా ఎవరు చూపించలేదు. చాలా బెస్ట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేశాం. → నేను ప్రతి క్యారెక్టర్ నీ ఎంజాయ్ చేస్తాను. డైరెక్టర్ తోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఆ ట్రావెల్ లోనే 50% వచ్చేస్తుంది. తర్వాత లొకేషన్ లో ఇంకొంత క్యారెక్టర్ మీద కమాండ్ పెరుగుతుంది.→ ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. ఇందులో లవ్‌స్టోరీ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ చూస్తారు.→ సినిమా ఒక హైపర్ ఎనర్జీతో వచ్చింది. దానికి తగ్గట్టు విశాల్ చంద్రశేఖర్ ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చారు. ఆర్ఆర్ చాలా బాగా చేశారు. చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇన్నోవేటివ్ సౌండ్ ఉంటుంది→ సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ ఒక ఫుల్ కామెడీ సినిమా అనుకున్నారు. మేము కూడా ప్రాపర్ కంటెంట్ ఇలా ఉంటుందని ప్రిపేర్ చేయలేకపోయాం. అందుకే చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందని అనుకుంటున్నాను. ఫుల్ ఫన్ అని వచ్చిన వాళ్ళు కొంత డిసప్పాయింట్మెంట్ అయిన మాట నిజమే. ఒక డిఫరెంట్ కంటెంట్ సినిమా చూడాలనే ఆడియన్స్ కి సినిమా చాలా నచ్చింది. టెలివిజన్ లో వచ్చిన తర్వాత కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ప్రయోగం చేసినప్పుడు వర్క్ కాకపోతే దానిని ఎక్స్పీరియన్స్ కింద చూడాలి. వర్క్ అయినా వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం.→ గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్ లో చేయాలి. లక్కీగా ఈ సినిమా కుదిరింది 100% కాన్ఫిడెన్స్ ఉన్న జోనర్ ఇది. ఈ జోనర్ లో గీత ఆర్ట్స్ తో చేయడం వెరీ వెరీ హ్యాపీ.→ ప్రస్తుతం మృత్యుంజయ అనే ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను.అలాగే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాను. -
ఆ డ్రామాలు నాకు నచ్చవు: కేతికా శర్మ
‘‘కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. హిట్, ఫ్లాప్స్ మన చేతిలో ఉండవు. ఓ నటిగా పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంటుంది. ఇండస్ట్రీలో కొనసాగడం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు కేతికా శర్మ. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘సింగిల్’. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్’ సినిమాలో ఆడీ కంపెనీలో పని చేసే పూర్వ అనే అమ్మాయిపాత్ర చేశాను.పూర్వ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఈ మూవీలోని లవ్‌స్టోరీ వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. అల్లు అరవింద్‌గారి సమర్పణలో గీతా ఆర్ట్స్‌లో ఓ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా ఇంట్రవెల్ సీక్వెన్స్ చాలా సవాల్‌గా అనిపించింది. ఇక ‘రాబిన్ హుడ్’ సినిమాలో నేను చేసిన ‘అదిదా సర్ప్రైజ్’లాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఈ మూవీలో లేవు.సెట్స్‌లో దర్శకులు ఏదీ చెబితే అది చేస్తాను. అలా ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్ చేశాను. ఈ సాంగ్‌లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌పై భిన్నా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్‌లో అలాంటి మూమెంట్స్‌పై జాగ్రత్తలు తీసుకుంటా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. మీరు లైఫ్‌లో సింగిల్‌గా ఉన్నారా? అన్న ప్రశ్నకు... ‘‘ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నాను. రిలేషన్షిప్ అంటూ లేనిపోని డ్రామాలు నాకు నచ్చవు. నిజాయితీగా ఉండాలి. రైట్ పర్సన్ దొరికితే... ప్రేమిస్తాను’’ అని చె΄్పారు కేతికా శర్మ. -
నా వయస్సు పెరిగింది.. రివ్యూల నంబర్ కూడా పెరగాలి: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం సింగిల్ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి డైరెక్టర్‌గా కార్తీక్ రాజు పనిచేస్తున్నారు. ఇటీవలే సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే శ్రీ విష్ణు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సినిమాలో రివ్యూల అంశంపై ఆయన మాట్లాడారు. రివ్యూలను మనం ఆపలేము.. మార్చలేము అన్నారు. కానీ రేటింగ్ నంబర్స్ మారితే బాగుంటుందని శ్రీ విష్ణు తెలిపారు.(ఇది చదవండి: 'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు)నా చిన్నప్పటి నుంచి ఇండియన్ రూపీతో పాటు అన్ని మారుతూ వచ్చాయని అన్నారు. నా వయస్సు కూడా పెరిగిందని.. అలాగే రేటింగ్ సిస్టమ్‌లో ఐదు పాయింట్లకు బదులు 50 నుంచి 100కు పెంచితే బాగుంటుందని శ్రీ విష్ణు సూచిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ అయినా అనలిస్ట్ల్లాగే.. ఇది కూడా అనలైసిసే కదా అన్నారు. రివ్యూల్లో చెప్పేది కొన్నిసార్లు కరెక్ట్ కావొచ్చు.. కాకపోవచ్చని తెలిపారు. ఎక్కువ నంబర్స్ ఇస్తే బాగుంటుందని.. ఒక్కసారి ట్రై చేయాలని శ్రీ విష్ణు సూచించారు. -
కావాలని అలా చేయలేదు: కార్తీక్ రాజు
‘‘నేను తమిళ డైరెక్టర్ని కావడంతో ‘సింగిల్’ సినిమాకు తెలుగు నేటివిటీ ఉండాలని ‘సామజ వరగమన’ సినిమాకు పని చేసిన భాను–నందు తెలుగు డైలాగ్స్ రాశారు. ఈ మూవీ ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్‌పై అభ్యంతరాలు ఎదురయ్యాయి. అయితే ఆ డైలాగులు కేవలం వినోదం కోసం పెట్టినవే.. కావాలని అలా చేయలేదు.. ట్రోల్ అవ్వాలని కాదు’’ అని డైరెక్టర్ కార్తీక్ రాజు అన్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘సింగిల్’. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్ కీలకపాత్ర చేశారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ–‘‘వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పోకిరి, ఒక్కడు, వర్షం, అతడు’ సినిమాలకు పని చేశాను. దర్శకత్వంపై ఆసక్తితో సూపర్ వైజర్‌గా రాజీనామా చేశాను. దర్శకుడిగా నా తొలి సినిమా ‘తిరు డాన్ పొలీస్’ను ఎస్పీ చరణ్‌గారు నిర్మించారు. తెలుగులో సందీప్ కిషన్‌తో నా తొలి మూవీ ‘నిను వీడని నీడను నేనే’. శ్రీవిష్ణుగారికి ‘సింగిల్’ కథను 2022 వినిపించగా ఓకే అన్నారు. 2023లో గీతా ఆర్ట్స్ వారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. స్కూల్ డేస్ నుంచి లవ్‌లో పడాలనుకునే అబ్బాయికి, 28 ఏళ్ల వయసు వచ్చినా లవ్‌లో పడలేకపోతాడు. దీంతో తన చుట్టూ ఉన్నవాళ్లు ఎవరూ ప్రేమలో పడకూడదనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ. అల్లు అరవింద్గారితో వర్క్ చేయడం నా అదృష్టం. విశాల్ చంద్రశేఖర్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీవిష్ణుగారి కోసం నా వద్ద మరో రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు. -
'#సింగిల్'తో అదృష్టం పరీక్షించుకోనున్న ఇవానా (ఫొటోలు)
-
'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు
శ్రీ విష్ణు (Sree Vishnu).. వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు సింగిల్ సినిమా (Single Movie)తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్లాన్‌లో ఉన్నాడు. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే బ్యూటీ ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.హర్టయిన మంచు విష్ణు!ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ను రీక్రియేట్ చేశారు. నందమూరి బాలకృష్ణ.. హనీరోజ్‌తో మలయాళం మాట్లాడేందుకు ప్రయత్నించినదాన్ని సినిమాలో వాడేశారు. అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్‌ను కూడా సింగిల్ మూవీలో రిపీట్ చేశారు. ఇది చూసిన కన్నప్ప టీమ్ హర్టరయ్యారని తెలిసి శ్రీ విష్ణు.. వారికి సారీ చెప్పాడు.మీమ్స్ వాడాం..శ్రీ విష్ణు మాట్లాడుతూ.. సింగిల్ సినిమా ట్రైలర్‌లోని కొన్ని డైలాగులకు కన్నప్ప టీమ్ (Kannappa Movie) హర్టయిందని తెలిసింది. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. మేం కావాలని చేయలేదు. కానీ, అది తప్పుగా జనాల్లోకి వెళ్లడం వల్ల ఆ డైలాగ్స్‌ను డిలీట్ చేశాం. సినిమాలో కూడా ఆ డైలాగ్స్ ఉండవు. ఎవరినీ హర్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఈ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్, సినిమా క్లిప్పింగ్స్ కానీ, బయట ఎక్కువ వైరల్ అయ్యేవాటిని తీసుకుని దాన్ని రీక్రియేట్ చేశాం.క్షమించండి: శ్రీ విష్ణుఆ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా అందరి డైలాగ్స్ వాడాం. ఎవరికైనా మా వల్ల ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించండి. ఇకపై మా టీమ్ నుంచి అలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం. ఇండస్ట్రీలో ఉన్న అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉంటాం. ఒకరినొకరు కించపరుచుకోవాలన్న దురుద్దేశమైతే మాకు లేదు. హర్టయినవారికి క్షమాపణలు చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నా అన్నాడు శ్రీవిష్ణు. ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రంలో శివయ్యా అనే డైలాగ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు.చదవండి: HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ -
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
పవన్ కల్యాణ్ ఏళ్లకేళ్లుగా చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. నాలుగైదేళ్లుగా సెట్స్ మీదే ఉంది. మే 9న పక్కా థియేటర్లలోకి వస్తామని పోస్టర్స్ మీద పోస్టర్లు వదిలారు. తీరా చూస్తే ఇప్పుడు సౌండ్ లేదు. దీంతో వాయిదా లాంఛనమే. మరోవైపు ఈ తేదీని ఇప్పుడు మరికొన్ని తెలుగు మూవీస్ పట్టేస్తున్నాయి. (ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్) మే 9 టాలీవుడ్ కి చాలా అచ్చొచ్చిన తేదీ. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి.. ఇలా చెప్పుకొంటూపోతే ఆ రోజున థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. 'హరిహర..' కూడా అదే తేదీ అనేసరికి ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఇప్పుడు మే 23న లేదంటే జూన్ 4న రావొచ్చని టాక్ వినిపిస్తుంది.పవన్ సినిమా వాయిదా లాంఛనమే అని తెలియడానికి మరోలా కూడా క్లారిటీ వచ్చింది. కొన్నిరోజుల క్రితం సమంత నిర్మించిన 'శుభం' మూవీ ఇదే తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు శ్రీ విష్ణు '#సింగిల్' కూడా మే 9న థియేటర్లలోకి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇలా వరస చిత్రాలు ఆ తేదీన రాబోతున్నాయంటే పవన్ మూవీ మరోసారి వాయిదా పడ్డట్లేగా.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
ఒక్క సినిమా..రెండు కోట్లు!
ఇన్నాళ్లకు... ఇన్నేళ్లకు నయనతార సొంత గొంతుని వినే అదృష్టం ప్రేక్షకులకు కలగనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పదేళ్లలో ఎన్నో సినిమాలు చేసిన నయనకు ఇంతవరకూ ఎవరెవరో డబ్బింగ్ చెప్పారు. తెలుగులో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో మాత్రం తొలిసారిగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. ఆమె డబ్బింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పటివరకు తమిళ ప్రేక్షకులకు మాత్రం నయనతార గొంతు వినే భాగ్యం కలగలేదు. ఈ ఏడాది అక్కడి ప్రేక్షకులకు కూడా తన మధురమైన కంఠస్వరాన్ని వినిపించాలని నయనతార నిర్ణయించుకున్నారు. మాజీ ప్రియుడు శింబు సరసన నయనతార ‘ఇదు నమ్మ ఆళు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఈ జంట నటిస్తున్న సినిమా ఇది. ఈ కథ, పాత్ర చెప్పి, ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుందని అటు శింబు... ఇటు నయన్‌కి చెప్పి, జత కలిపారు ఈ చిత్రదర్శకుడు పాండిరాజ్. ఆ విషయంలో విజయం సాధించిన పాండిరాజ్, నయనతారతో డబ్బింగ్ కూడా చెప్పించేస్తున్నారు. ‘మీ గొంతు వినిపిస్తేనే పాత్ర ఎలివేట్ అవుతుంది’ అని నయనకి చెప్పడం, ఆమె ఒప్పుకోవడం జరిగింది. శింబు, నయనతార నటించడంవల్ల ఇప్పటికే ఈ చిత్రానికి భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడింది. ఇక, నయనతార గొంతు అదనపు ఆకర్షణ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొసమెరుపు ఏంటంటే.. తమ కలయికలో సినిమా అంటే.. బిజినెస్‌పరంగా చాలా క్రేజ్ ఉంటుందని గ్రహించిన నయనతార, ఇప్పటివరకూ ఏ సినిమాకీ తీసుకోనంత భారీ పారితోషికం తీసుకున్నారట. మామూలుగా ఒక సినిమా కోటి నుంచి కోటిన్నర రూపాయల లోపు తీసుకుంటారు. అంతకన్నా భారీ అంటే.. రెండు కోట్ల దాకా తీసుకొని ఉంటారని కోలీవుడ్ టాక్.